గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ..సమ్మర్‌‌‌‌‌‌‌‌కు షిప్ట్ 

గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ..సమ్మర్‌‌‌‌‌‌‌‌కు షిప్ట్ 

కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించి పద్దెనిమిదేళ్లు  దాటినా.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్‌‌‌‌తో  సత్తా చాటుతోంది అంజలి. అచ్చతెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడలోనూ నటిగా ప్రూవ్ చేసుకుంది. హీరోయిన్‌‌‌‌గా, ఫిమేల్ లీడ్‌‌‌‌గా, ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తోంది అంజలి. తాజాగా ఆమె నటించిన 50వ చిత్రం విడుదలవుతోంది.  పదేళ్ల క్రితం ‘గీతాంజలి’గా ఆకట్టుకున్న ఆమె.. ఇప్పుడు   ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అంటూ  సీక్వెల్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని  మార్చి 22న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.

కానీ ఆ డేట్‌కు మరో మూడు సినిమాల రిలీజులు ఉండటంతో  తమ చిత్రాన్ని వాయిదా వేస్తూ మంగళవారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు.  సమ్మర్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌గా  ఏప్రిల్ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇది అంజలికి ల్యాండ్ మార్క్ మూవీ  కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ వాటిని మరింత పెంచాయి.  కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ స‌‌‌‌త్యనారాయ‌‌‌‌ణ

జీవీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. సునీల్, అలీ,  శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్ ఇతర పాత్రలు పోషించారు. మరోవైపు రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అంజలి..  ప్రస్తుతం నెదర్లాండ్స్‌‌‌‌లోని ఆమ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌డామ్‌‌‌‌లో చిల్ అవుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.