మూసీ కోసం బీఆర్ఎస్ చేసిన పనులు చిన్న వరదకే కొట్టుకుపోయాయి: మంత్రి శ్రీధర్ బాబు

మూసీ కోసం బీఆర్ఎస్ చేసిన పనులు చిన్న వరదకే కొట్టుకుపోయాయి: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. బుధవారం ( మార్చి 18 ) సభ ప్రారంభానికి ముందు అసెంబ్లీ గేటు దగ్గర ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొక్కజొన్న రైతులకు మద్దతుగా మొక్కజొన్న కంకులతో ఆందోళన చేపట్టారు.అనంతరం సభలో మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. రూ. 16 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఎందుకంటూ ప్రశ్నించారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో మూసీ కోసం చేసిన పనులు చిన్న వరదకే కొట్టుకుపోయాయని అన్నారు

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..మూసీ ప్రక్షాళనలో మెయిన్ హార్ట్ అనే కంపెనీకి డీపీఆర్ పనులు అప్పగించామని అన్నారు. 2024 డిసెంబర్ లో మెయిన్ హార్ట్ కంపెనీకి డీపీఆర్ పనులు అప్పగించామని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అన్ని సమగ్రంగా రెడీ చేసి మూసీ డీపీఆర్ ఇస్తామని వెల్లడించారు. ఏడీబీ సంస్థ మూసీ ప్రక్షాళన కోసం మూడుసార్లు చర్చించిందని..మూసీ ప్రక్షాళన రుణం కోసం అనేక రకాలుగా సంప్రదిస్తున్నామని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 20 STPలను పెట్టిందని..వాటిలో 90శాతం పనులు తమ ప్రభుత్వమే చేస్తోందని అన్నారు.అందరి సలహాలు సూచనలతో మూసీ ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు శ్రీధర్ బాబు.మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ చేసిన పనులు బఫర్ జోన్ లో ఉన్నాయని... బీఆర్ఎస్ చేసిన పనులు చిన్న వరదకే కొట్టుకుపోయాయని అన్నారు శ్రీధర్ బాబు.