మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ స్నేహా శబరీశ్

మెరుగైన వైద్య సేవలు అందించాలి :  కలెక్టర్ స్నేహా శబరీశ్

మహబూబాబాద్/ ములుగు, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మహబూబాబాద్, ములుగు కలెక్టర్లు స్నేహా శబరీశ్, దివాకర​వైద్యాధికారులకు సూచించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం వారు ఆయా జిల్లాల్లో పర్యటించారు. మానుకోట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్​ అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్ లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్సిజన్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. 

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో వైద్య సేవల నిమిత్తం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ములుగు మండలం జంగాలపల్లి, రాయినిగూడెం, కొత్తూరు, కాశిందేవిపేట గ్రామాల్లో ఆ జిల్లా కలెక్టర్ పర్యటించి, పారిశుధ్య పనులు తనిఖీ చేశారు. నర్సరీని పరిశీలించడంతోపాటు పీహెచ్​సీలో అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్​ ఆవరణలోని ఈవీఎం గోదామును ఆయన అడిషనల్​ కలెక్టర్​ మహేందర్​జీ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. భద్రత, పర్యవేక్షణపై ఆరా తీశారు.