
సౌత్ స్టార్ బ్యూటీ తమన్నా(Thamannaah) మీడియాపై ఫైర్ అయ్యారు. తన సినిమాలపై, సినిమాలో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ పై ప్రశ్నలు వేసిన రిపోర్టర్ పై రెచ్చిపోయింది మిల్కీ బ్యూటీ. హాఫ్ నాలెడ్జ్ ప్రశ్నలడగొద్దు అంటూ మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తమన్నా ఈ మధ్య కొన్ని బోల్డ్ సిరీస్ లలో హాట్ హాట్ సీన్స్ లో నటించిన విషయం తెలిసిందే. వాటిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది తమన్నా. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆమెకు ఇదే విషయంపై ప్రశ్న ఎదురైంది. ఈ మధ్య మీలో బోల్డ్‌నెస్ కాస్త ఎక్కువైంది. అవకాశాలు తగ్గడం వల్లే ఈ డెసిషన్ తీసుకున్నారా? అంటూ ఓపెన్ గా అడిగేశారు యాంకర్.
Also Read :- రవితేజపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్న యష్ ఫ్యాన్స్
ఈ ప్రశ్నకు తమన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. తోచింది రాసినంత ఈజీ కాదు యాక్టింగ్ అంటే. అయినా నాకు అవకాశాలు తగ్గాయని మీకు ఎవరు చెప్పారు?. ప్రస్తుతం నేను రోజుకి 18గంటలు పనిచేస్తున్నా.. ఇంత బిజీగా ముందు ఎప్పుడు లేను. నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు. ప్రవర్తన, వేషధారణ అనేవి మనం చేస్తున్న పాత్రను బట్టి ఉంటాయి. ఏ పాత్ర అయినా నచ్చితేనే చేస్తాను. ఒకసారి ఒప్పుకున్నాక ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడం నా ధర్మం. హాఫ్ నాలెడ్జ్ ప్రశ్నలు అడగకండి ప్లీజ్.. అంటూ సాలిడ్ ఆన్సర్ ఇచ్చారు తమన్నా. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.