తమిళ నటుడు శ్రీరామ్కు డ్రగ్స్ కేసులో 14 రోజుల రిమాండ్

తమిళ నటుడు శ్రీరామ్కు డ్రగ్స్ కేసులో 14 రోజుల రిమాండ్

చెన్నై: తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీరామ్గా సుపరిచితుడైన తమిళ నటుడు శ్రీకాంత్ తెలిసే ఉంటుంది. ‘ఒకరికి ఒకరు’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రీరామ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. డ్రగ్స్ ముఠా నుంచి కొకైన్ కొనుగోలు చేసిన కేసులో సోమవారం (జూన్ 24) అరెస్ట్ అయిన తమిళ నటుడు శ్రీకాంత్కు(శ్రీరామ్ కృష్ణమాచారి) ఎగ్మోర్ 14th మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జ్యుడీషియల్ కస్టడీ విధించారు. 

ఈ కేసులో శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం  రాత్రి మేజిస్ట్రే్ట్ ముందు హాజరుపర్చారు. జులై 7, 2025 వరకూ.. 14 రోజుల పాటు తమిళ నటుడు శ్రీకాంత్కు మేజిస్ట్రేట్ జ్యుడీషియల్ కస్టడీ విధించడం గమనార్హం.

ALSO READ | డ్రగ్స్ కేసులో హీరో శ్రీరాం విచారణ : ఆ పొలిటికల్ పార్టీ లీడర్ కూ లింక్స్

అన్నాడీఎంకే (AIADMK) ఐటీ వింగ్ సభ్యుడు టి.ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత శ్రీకాంత్ ను కూడా అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ కు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

కిల్పాక్ మెడికల్ కాలేజీలో శ్రీకాంత్ కు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఎగ్మోర్ 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మెజిస్ట్రేట్ దయలాన్ ముందు హాజరుపరిచారు. 

ఆ తర్వాత నుంగంబాకం పోలీస్ స్టేషన్ లో దాదాపు 9 గంటల పాటు విచారించారు. శ్రీకాంత్ బ్లడ్ సాంపుల్స్ తీసుకుని పరీక్షించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలినట్లు నార్కోటిక్ అధికారులు నిర్ధారించారు.