పండగపూట డైరెక్టర్ హరి ఇంట్లో విషాదం

పండగపూట డైరెక్టర్ హరి ఇంట్లో విషాదం

తమిళనాట మాస్‌‌ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌‌ దర్శకుడు హరి(Hari).  నిన్న (అక్టోబర్ 21) దర్శకుడు హరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వీఏ గోపాలకృష్ణన్ (88) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డైరెక్టర్ హరి తండ్రి మృతి పట్ల కోలీవుడ్‌,టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు సంతాపం ప్రకటించారు. 

హరి స్వగ్రామం అయిన టుటికోరిన్ జిల్లాలో కాచనవెల్లిలో గోపాలకృష్ణన్ అంత్యక్రియలు ఇవాళ ఆదివారం (అక్టోబర్ 22న) నిర్వహించనున్నారు. గోపాలకృష్ణన్ కు దర్శకుడు హరితో పాటు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Also Read : ఓటీటీలో ఊరమాస్ స్కంద.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

డైరెక్టర్ హరి ప్రస్తుతం విశాల్ హీరోగా మాస్ యాక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. విక్రమ్ హీరోగా 2003లో సామి, 2010లో సూర్య సింగం సీరీస్ తో వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సాధించి మాస్ డైరెక్టర్ గా ఫేమస్ అయ్యారు.