VD12 Movie: విజయ్ దేవరకొండ VD12లో..కోలీవుడ్ స్టార్ హీరో కొడుకు!

VD12 Movie: విజయ్ దేవరకొండ VD12లో..కోలీవుడ్ స్టార్ హీరో కొడుకు!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో..మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది VD12 అని చెప్పుకోవాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Goutham thinnanuri) కావడమే. ఈ దర్శకుడి నుండి వచ్చిన మళ్ళీ రావా, జెర్సీ సినిమాలు ఆడియన్స్ను అలరించాయి. లేటెస్ట్ గా VD12 నుంచి క్రేజీ టాక్ వినిపిస్తోంది.ఈ ప్రాజెక్ట్ తో తమిళ స్టార్ హీరో కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అతనే చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram).

విజయ్ దేవరకొండ బ్లాక్ బాస్టర్ అర్జున్ రెడ్డిని తమిళంలో రీమేక్ నటించి హిట్ కొట్టారు ధృవ్. ఆ తర్వాత తండ్రి విక్రమ్ తో కలిసి మహాన్ సినిమా చేసి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.కానీ, మహాన్ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడంతో ఎక్కువమందికి చేరలేకపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో విజయ్ దేవరకొండ, గౌతమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కీ రోల్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

ఈ సినిమా కోసం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అద్దిరిపోయే స్టోరీ రెడీ చేసినట్టు సమాచారం.ఈ స్టోరీ  గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ జోనర్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీలో ధృవ్ విక్రమ్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనే విక్రమ్ ఫ్యాన్స్ లో నెలకొంది. త్వరలో ఇదే విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

VD 12ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. నిజానికి సినిమా పూజా కార్యక్రమంతో మొదలుపెట్టిన సమయంలో విజయ్ దేవరకొండ, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు అయితే ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుంటున్నట్టు ప్రచారం అయితే ఉంది.