AI కారణంగా జాబ్ పోయింది.. ఛాలెంజ్ చేసి మరీ ఏఐ జాబ్ కొట్టాడు.. జీతం చూస్తే వావ్ అనాల్సిందే !

AI కారణంగా జాబ్ పోయింది.. ఛాలెంజ్ చేసి మరీ ఏఐ జాబ్ కొట్టాడు.. జీతం చూస్తే వావ్ అనాల్సిందే !

ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలి.. అనే సామెతను బాగా ఒంటబట్టించుకున్నట్లుంది ఈ ఒరాకిల్ టెకీ. ఏఐ కారణంగా ఉద్యోగం పోయిందని.. ఏకంగా ఏఐని ఛాలెంజ్ చేసి.. ఏఐ ఉద్యోగం కొట్టాడు. అది కూడా పాత కంపెనీతో పోల్చితే బెస్ట్ శాలరీతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టెక్ ఇండస్ట్రీ అయ్యాడు ఈ ఒరాకిల్ ఉద్యోగి. 

ఉద్యోగం పోయిందని బాధ పడకుండా.. కసిగా కొత్త టెక్నాలజీ నేర్చుకుని.. కేవలం 45 రోజుల్లో మూడు ఉద్యోగాలు సంపాదించాడు. పాత కంపెనీతో పోల్చితే 20 శాతం హైక్ తో ఏఐ ఇంజినీర్ గా ఉద్యోగంలో చేరాడు. 

ఒరాకిల్ కంపెనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ 2026 మార్చి 31న లేఆఫ్ కు గురయ్యాడు. రెండేళ్ల ఎక్స్ పీరియెన్స్ ఉన్న తను.. వేల మంది ఉద్యోగుల్లో ఒకడిగా లేఆఫ్ అయినట్లు రెడిట్ లో పోస్ట్ చేశాడు. ఉద్యోగం పోయింది.. నేను చాలా కూల్ గా ఉండేవాడిని.. జాబ్ పోయిన తర్వాత ప్రిపేరేషన్ మోడ్ లోకి వెళ్లిపోయాను. నన్ను నేను లాక్ చేసుకున్నాను.. అంటూ పోస్టులో పేర్కొన్నాడు. 

  • ఇది ప్రిపేరేషన్ అంటే..

ఏఐ కారణంగా జాబ్స్ పోతున్నాయని.. ఏఐ జాబ్ నే టార్గెట్ గా పెట్టుకున్నాడు. అందుకోసం రోజు 3 నుంచి 4 గంటలు డేటా స్ట్రక్చర్, ఆల్గారిథమ్ ప్రాక్టీస్ చేసేవాడు. దీనికి తోడు ఓ రెండు గంటలు ఏఐ కాన్సెప్టులు చదివేవాడట. తన స్కిల్స్ చూయించుకునేందుకు ప్రాజెక్ట్స్ తయారు చేసుకుని పెట్టుకున్నాడట. 

జాబ్ వేటను.. ఫుల్ టైమ్ టాస్క్ లా భావించి.. ప్రతిరోజు 10–15 జాబ్స్ కు అప్లై చేసుకునేవాడట. LinkedIn, Wellfound, Naukri, Indeed వంటి ప్లాట్ ఫామ్స్ లో అప్లై చేస్తూ.. రెగ్యులర్ గా ప్రొఫైల్ అప్డేట్ చేసేవాడు. కొన్ని వారాల్లోనే రిక్రూటర్లు ఇతన్ని రీచ్ అయ్యారట. 

లింక్డ్ ఇన్ ద్వారానే ఏకంగా 20 మంది రిక్రూటర్ల వచ్చినట్లు చెప్పాడు. లింక్డ్ ఇన్ ప్రీమియమ్ చాలా హెల్ప్ చేసిందని చెప్పుకొచ్చాడు. మే తొలి వారం నుంచి మే నెల సగం అయ్యే వరకు ఇంటర్వూలు ఇస్తూ వచ్చాను.. 7 కంపెనీలు ఇంటర్వూ చేస్తే కొన్ని పెయిల్ అయ్యాను.. అందులో 3 ఆఫర్లు సంపాదించాను.. ఫైనల్ గా ఏఐ ఇంజినీర్ గా జాయిన్ అవబోతున్నాను.. అంటూ  రెడిట్ లో పోస్ట్ చేశాడు. 

ALSO READ : విచ్చలవిడి ఏఐ వాడకంతో కరెంట్, నీటి కష్టాలు.. 

  • ఆన్ లైన్ లో బిగ్ డిబేట్:

ఈ ఒరాకిల్ మాజీ ఉద్యోగి ఛాలెంజ్ ను, డెడికేషన్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. చాలా ఇన్ స్పిరేషన్ అని కొందరు ప్రశంసించారు. నిరంతర ప్రిపేరేషన్ తో,  మార్కెట్ లో ఉన్న అనిశ్చితిని అధిగమించవచ్చునని నిరూపించారని కామెంట్ చేస్తున్నారు. 

ఇంత త్వరగా కోలుకోవడం ఒక వరం అంటూ ఒక ఉద్యోగి అనగా.. ఇది చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇది వినటానికి బాగుంది. కానీ చాలా మంది ఇంత ఒత్తిడిని తట్టుకోలేరు.టెక్ ఇండస్ట్రీలో గ్రైండ్ కల్చర్ పెరిగిపోతుందని అనటానికి ఇది ఒక ఉదాహరణ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. గ్రైండ్ కల్చర్ అంటే ఒత్తిడిలో నలిగిపోతూ.. తయారవటం.

కొందరు భిన్నంగా రెస్పాండయ్యారు. మిత్రులారా, సాధారణ టైర్ 3 ఉద్యోగులకు మార్కెట్ ఇంకా అంత బాగాలేదు.  అతడు  టాప్ NIT నుండి వచ్చాడు.. రెజ్యూమేలో ఒరాకిల్ ఉంది .. అందుకే తొందరగా మరో జాబ్ కొట్టడలిగాడని ఒకరు అన్నారు. 

మీకు జాబ్ రావటంపై ఎలాంటి అసూయ లేదు. మీకు కంగ్రాట్స్.. కానీ నాలాంటి చాలా మంది, ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉద్యోగం లేకుండా  నిరుత్సాహానికి గురై, తమను తామే ప్రశ్నించుకుంటున్న పరిస్థితి. అసలు సమస్య ఏంటంటే, ఈ రోజుల్లో కంపెనీలు టైర్ 1 అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మా రెజ్యూమేలు షార్ట్‌లిస్ట్ కూడా కావడం లేదు. అంటూ మరొకరు రాసుకొచ్చారు. 

తక్కువ సంవత్సరాల అనుభవం, తక్కువ CTC కారణంగా, ఆ మాజీ ఒరాకిల్ టెక్నీషియన్ ఇతరుల కంటే సులభంగా ఉద్యోగం సంపాదించాడని కొందరు కామెంట్ చేశారు. చాలా వరకు 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవాళ్లు జాబ్ పోయిన తర్వాత ఆఫర్లు పొందడం చాలా కష్టంగా ఉంది. అని ఒక రెడ్డిట్ యూజర్ అన్నారు.