
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) కాంబోలో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్ (HanuMan). కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 12న) రిలీజ్ కాబోతుంది. అంటే హనుమాన్ మూవీ మరికొన్నిగంటల్లో థియేటర్లోకి రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ షోలు ముందుగానే, తెలుగు రాష్ట్రాల్లో జనవరి 11న సాయంత్రం 6 గంటల నుంచి స్పెషల్ షోస్ పడనున్నాయి. అంతేకాకుండా బెంగళూరులో కొన్ని స్క్రీన్లు, అమెరికాలో పెద్ద ఎత్తున థియేటర్లో ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారు.
అయితే హనుమాన్కి నార్త్లో ఉన్న క్రేజీ దృష్ట్యా..అందరి కంటే ముందుగా..ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ఈ సినిమాను చూసిన ప్రముఖ ట్రేడ్ సినీ అనలిస్ట్, సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్(Taran Adarsh) తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలిపారు. హనుమాన్ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..ఫెంటాస్టిక్ అని తెలిపారు. ఇంకా సినిమా గురించి, హీరో, డైరెక్టర్ టెక్నీషియన్స్ గురించి ఆయన ఏమన్నారంటే?
హనుమాన్ రివ్యూ:
సూపర్ హీరోగా వచ్చిన హనుమాన్ ఒక సాలిడ్ ఎంటర్టైనర్ అంటూ 3.5/5 రేటింగ్ ఇచ్చారు తరణ్ ఆదర్శ్. ఈ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సాలిడ్ ఎంటర్టైనర్ గా తీశారు. మనుషుల మధ్య మెదిలే డ్రామా, వారిలో కలిగే ఎమోషన్స్, సినిమా ప్రతి ఫ్రేమ్ లో వీఎఫ్ఎక్స్ వర్క్, హనుమాన్ ను చూపే మైథాలజీని ఆయన సమపాళ్లలో అద్భుతంగా మేళవించారు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా చాలా బావుంది. ఈ సూపర్ హనుమాన్ మ్యాన్ కు ఆడియన్స్ ఫిదా అవుతారాని చెప్పారు. ఇక ఫైట్ సీన్స్ చూస్తే ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయని..సినిమా క్లైమాక్స్ అదిరిపోయిందని..తరణ్ ఆదర్శ్ వివరించారు. అంతే కాకుండా హనుమాన్ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలని రికమండ్ కూడా చేశారు.
హీరో తేజ సజ్జ యాక్టింగ్ గురించి చెబుతూ..
హీరో తేజ సజ్జ తన అమాయకమైన..బలహీనత పాత్రలో బాగా నటించారు. ఇక ఆ తర్వాత హనుమంతుడి బలం తోడయ్యాక అతని నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపొయ్యేలా ఉంటుందని తెలిపారు. వర్సటైల్ యాక్టర్స్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి తనదైన మార్క్ చూపించారు. విలన్ పాత్రలో నటించిన వినయ్ రాయ్ నటన బాగుందని..వర్సటైల్ యాక్టర్ సముద్రఖని సూపర్ ఫామ్ లో ఉన్నారు. హనుమాన్ లో తన పాత్ర అందరికీ నచ్చుతుందని తెలిపారు. కమెడియన్ వెన్నెల కిశోర్ ఇంకాసేపు ఉంటే బావుంటుందని అనిపిస్తుందని తరణ్ ఆదర్శ్ చెప్పారు. హనుమాన్ కథలో వీఎఫ్ఎక్స్ సినిమా మొత్తానికి కీలక పాత్ర పోషించిందని, కథకు మరింత అదనపు బలాన్ని ఇచ్చిందని ఆయన తన అభిప్రాయాన్ని వివరించారు. హిందీ వెర్షన్ చూసిన తరణ్ ఆదర్శ్..డబ్బింగ్ కూడా అందరికీ నచ్చేలా ఉందన్నారు. కానీ, ఫస్టాఫ్ లో మాత్రం రన్ టైం కాస్త తగ్గిస్తే ఇంకా బావుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
#OneWordReview...#HanuMan: FASCINATING.
— taran adarsh (@taran_adarsh) January 11, 2024
Rating: ⭐️⭐️⭐️½
Director #PrasanthVarma crafts a solid entertainer… #HanuMan is ambitious and exciting - packs drama, emotions, VFX and mythology skilfully… Loaded with goosebump moments + extraordinary finale… Recommended!… pic.twitter.com/7M2RKk2zkd
హనుమాన్ ప్రీమియర్ షో టికెట్లను రిలీజ్ చేసిన గంటలనే టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడైనట్లు నైజం డిస్ట్రిబ్యూటర్స్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. హనుమాన్ మూవీ తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.