Vijay Binni: తేజ హనుమాన్ సాంగ్స్..నా సామిరంగ డైరెక్టర్వే..ఎలా అంటే?

Vijay Binni: తేజ హనుమాన్ సాంగ్స్..నా సామిరంగ డైరెక్టర్వే..ఎలా అంటే?

డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని (Vijay Binni) తెలుగులో 100కి పైగా సినిమాలకు నృత్య రీతులు సమకూర్చాడు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ6లో ఫేమస్ డ్యాన్స్ మాస్టర్గా గుర్తింపు పొందాడు విజయ్. ఇప్పుడు విజయ్ బిన్నీ డైరెక్టర్గా మారుతూ నాగార్జునతో నా సామిరంగ (Naa Saami Ranga) మూవీని తక్కువ కాలంలో తెరకెక్కించి సంక్రాంతి బరిలో నిలిపాడు. 

ప్రస్తుతం సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న నాలుగు సినిమాల్లో..ముందుగా వస్తోన్న హనుమాన్ మూవీకి..నా సామి రంగ డైరెక్టర్ విజయ్ బిన్ని పనిచేసాడు. హనుమాన్ సినిమాలో వచ్చే కథరీత్యా మాంటేజ్ సాంగ్స్కు డ్యాన్స్ మాస్టర్గా పనిచేసినట్లు నా సామిరంగ ప్రమోషన్స్లో తెలిపాడు. ఈ మూవీలో మాంటేజ్ సాంగ్స్ ఉంటాయని..వాటిలో క్రియేటివిటీ చూపించడానికి తనకు మంచి అవకాశం లభించినట్లు చెప్పాడు. అంతేకాదు..విజయ్ బిన్నీ చివరగా డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన మూవీ హనుమాన్ కావడం విశేషం. 

తాను డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యంతోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్లు తెలిపారు. అయితే, తాను ముందు డ్యాన్సర్ అవ్వడంతో సినిమా పరంగా అన్ని క్రాప్ట్స్ మీద అవగాహనా పెంచుకుని..తక్కువ టైములో నా సామిరంగ సినిమాని డైరెక్ట్ చేశానని చెప్పారు. ఆగస్టులో మొదలుపెట్టిన నా సామిరంగ మూవీ కేవలం 3 నెలలలోపే తెరకెక్కించగలిగినట్లు తెలిపారు. 

డ్యాన్స్ మాస్టర్..హీరో అయిన లారెన్స్ను డైరెక్టర్గా నాగార్జున పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇపుడు మరో డ్యాన్స్ మాస్టర్ అయిన విజయ్ బిన్నిని పరిచయం చేస్తుండటంతో..టాలీవుడ్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే నా సామిరంగ ట్రైలర్, సాంగ్స్ ఉన్నాయి. ఈ మూవీ పక్కా సంక్రాంతికి అసలైన హిట్ కొట్టబోతుందంటూ కాన్ఫిడెన్స్ తో వెల్లడించాడు.

విజయ్ బిన్ని డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన సినిమాలు చూసుకుంటే.. నాని తో జెర్సీ,నేను లోకల్ మూవీతో పాటు రామ్ హలో గురు ప్రేమ కోసమే,ఛలో,ప్రేమమ్,అర్జున్ సురవరం,డిస్కో రాజా,కృష్ణ బృందా విహారి,రంగబలి,మామ మశ్చేంద్ర,హనుమాన్,నా సామిరంగ వంటి సహా అనేక సినిమాల్లో డాన్స్తో సంబంధం లేకుండా..కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా, క్రియేటివ్గా తాను పాటలు కొరియోగ్రాఫీ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.