AP EAMCET 2026 విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చి 17 వరకు రిజిస్ట్రేషన్ గడువు పెంపు!

 AP EAMCET 2026 విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చి 17 వరకు రిజిస్ట్రేషన్ గడువు పెంపు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) AP EAMCET 2026 కోసం రిజిస్ట్రేషన్  గడువు  తేదీని పొడిగించింది. ఏపీ ఎంసెట్ (EAMCET) 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇప్పుడు మార్చి 17, 2026 వరకు దరఖాస్తు చేసుకోవడానికి  అవకాశం కల్పించింది.

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్,  ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ పొడిగింపు మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు cets.apsche.ap.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేసుకునేందుకు ఇప్పుడు ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 6, 2026 వరకు చేసుకోవచ్చు. దీని తర్వాత, పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఏప్రిల్ 28, 2026 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

పరీక్ష తేదీలు గతంలో షెడ్యూల్ చేసినట్లే ఉంటాయి. ఇంజనీరింగ్ (బిటెక్) 2026 మే 12, 13, 14, 15, 18 తేదీల్లో నిర్వహించబడతాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు 2026 మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. పరీక్షల తర్వాత కీ పేపర్స్ మే 23, 2026న విడుదల చేస్తారు.  ఫలితాలు 1 జూన్  2026న ప్రకటించే అవకాశం ఉంది.

AP EAMCET 2026కి దరఖాస్తు చేసుకోండి ఇలా:
1.  మొదట cets.apsche.ap.gov.in అధికారిక APSCHE పోర్టల్‌ ఓపెన్ చేయండి.
2. హోమ్‌పేజీలో AP EAPCET 2026 లేదా AP EAMCET 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్  చేసుకోవడానికి మీ వివరాలను ఎంటర్ చేసి, మీ లాగిన్ క్రియేట్ చేసుకోండి
4. మీ లాగిన్ వివరాలు ఉపయోగించి లాగిన్ అవ్వండి. మీ వ్యక్తిగత, విద్యా,  కాంటాక్ట్  వివరాలతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్‌ను నింపండి. 
5. మీ లేటెస్ట్ ఫోటో, సంతకం  స్కాన్ చేసి, సూచించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.
6. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా AP ఆన్‌లైన్ సేవల ద్వారా  దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించండి.
7. చివరగా ఫామ్‌ సబ్మిట్ చేసి  డౌన్‌లోడ్ చేసుకోండి లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి. 

AP EAMCET 2026 దరఖాస్తు ఫీజు కేటగిరీని బట్టి మారుతుంది.  
ఓపెన్ కేటగిరీ: రూ. 800/-
బిసి వర్గం: రూ. 750/-
SC/ST వర్గం: రూ. 700/-

లెట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 17 చివరి తేదీ. ఈ గడువును దాటిన అభ్యర్థుల కోసం APSCHE ఒక షెడ్యూల్‌ కూడా అందించింది, లేట్  ఫీజుతో  దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 3, 2026.  అర్హత, సిలబస్, పరీక్షాకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ తప్పకుండా చెక్ చేయాలి.