స్పోర్ట్స్ బైక్ మోజుతో.. డ్యూక్ అద్దెకు తీసుకున్న ఇంటర్ స్టూడెంట్స్... ట్రిపుల్ రైడింగ్ వెళ్లి... 

స్పోర్ట్స్ బైక్ మోజుతో.. డ్యూక్ అద్దెకు తీసుకున్న ఇంటర్ స్టూడెంట్స్... ట్రిపుల్ రైడింగ్ వెళ్లి... 

హైదరాబాద్ లో దారుణం జరిగింది. స్పోర్ట్స్ బైక్ పై మోజుతో డ్యూక్ బైక్ తీసుకున్న ఇంటర్ స్టూడెంట్స్ సరదాగా రైడ్ కి వెళ్లగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని నాగోల్ శివారులో జరిగింది ఈ ఘటన. మంగళవారం ( మార్చి 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కొత్తపేటలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విష్ణువర్ధన్, ఉషాకిరణ్, మణిదీప్ లు స్పోర్ట్స్ బైక్ పై మోజుతో కేటీఎమ్ డ్యూక్ అద్దెకు తీసుకున్నారు.

సోమవారం ( మార్చి ) 2 మ్యాథ్స్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత కలుసుకున్న ముగ్గురు స్నేహితులు డ్యూక్ అద్దెకు తీసుకొని సరదాగా రైడ్ వెళ్లాలని  ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం డ్యూక్ బైక్ అద్దెకు తీసుకున్న ముగ్గురు స్నేహితులు.. నాగోల్ శివారు ప్రాంతంలో రైడ్ కి వెళ్లారు. నాగోలు శివారులోని ఫత్తుల్లాగూడ 100 ఫీట్ రోడ్డులో రైడ్ కి వెళ్లి అక్కడే ఫొటోలు తీసుకున్నారు. తిరిగి వస్తున్న క్రమంలో అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టింది బైక్.

బైక్ డివైడర్ ను బలంగా ఢీకొట్టడంతో విష్ణువర్ధన్ తలకు తీవ్ర గాయలయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉషాకిరణ్ కు కాలు, చేయి విరిగాయి. స్నేహితులు తిరిగి రాకపోవడంతో మణిదీప్ ఫోన్ చేయగా ప్రమాదం విషయం తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.