Theatrical Movies: ఈ శుక్రవారం థియేటర్‌లో ఏకంగా 8 తెలుగు సినిమాలు.. థ్రిల్లర్, కామెడీ, హారర్‌ జానర్లో

Theatrical Movies: ఈ శుక్రవారం థియేటర్‌లో ఏకంగా 8 తెలుగు సినిమాలు.. థ్రిల్లర్, కామెడీ, హారర్‌ జానర్లో

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, ఇంగ్లీష్.. ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. అయితే, ఈ శుక్రవారం (మార్చి 6) విడుదల కానున్న సినిమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా తెలుగులోనే ఏకంగా 9 సినిమాలు వస్తున్నాయి. మరి ఆ కొత్త సినిమాలు ఏమిటి? అవి ఏ జానర్లకు చెందినవి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతున్నాయి? అనేది చూసేద్దాం. 

‘మృత్యుంజయ్’:

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో శ్రీవిష్ణు. మొన్నే 28న ‘విష్ణు విన్యాసం’తో వచ్చి ఆకట్టుకున్నాడు. మళ్ళీ వారం గ్యాప్ లోనే ‘మృత్యుంజయ్’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. వాస్తవానికి ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్స్‌‌ను ఒకరోజు గ్యాప్‌‌లో ప్రకటించగా, ‘మృత్యుంజయ్’ ను పోస్ట్ పోన్ చేస్తూ ఈ శుక్రవారం (మార్చి 6న)తీసుకొస్తున్నారు.

హుస్సేన్ షా కిర‌‌ణ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కింది. ఒక క్లిష్టమైన మర్డర్ కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా శ్రీవిష్ణు నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరూ గతంలో ‘సామజవరగమన’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో వీరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని:

90s వెబ్ సిరీస్, కోర్ట్, దండోరా సినిమాలతో ఆకట్టుకున్న శివాజీ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే క్రైమ్‌ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ సినిమాను స్వయంగా శివాజీనే నిర్మించడం విశేషం.

సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, లయ భార్యాభర్తలుగా నటించారు. 90స్ వెబ్ సిరీస్‌లో శివాజీకి కొడుకుగా నటించిన యంగ్ ఆర్టిస్ట్ రోహన్ ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రలో కనిపించనున్నాడు.

టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మార్చి 6న మూవీ థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఫస్ట్ ఈ మూవీని నేరుగా ఈటీవీ విన్‌ ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్న విషయం తెలిసిందే 

సతీ లీలావతి:

మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ కామెడీ ‘సతీ లీలావతి’. ఈ సినిమాలో దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌‌‌‌‌‌‌‌.ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌ చిత్రాలను తెరకెక్కించిన తాతినేని సత్య.. ఈ మూవీని తెరకెక్కించాడు. శుక్రవారం మార్చి 6న ఈ మూవీ థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది

సరస్వతి’

వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన  చిత్రం ‘సరస్వతి’.  తన సోదరి పూజా శరత్ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆమె నిర్మించింది. మార్చి 6న సినిమా విడుదల కానుంది.

సోషల్ మెసేజ్‌‌‌‌తో పాటు ఎంగేజింగ్‌‌‌‌గా క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది.  నటిగా గ్లామర్ రూల్స్‌ను బ్రేక్ చేసిన వరలక్ష్మి, ఇప్పుడు దర్శకురాలిగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మెన్షన్‌‌‌‌ హౌస్ మల్లేష్

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మెన్షన్‌‌‌‌ హౌస్ మల్లేష్’. విలేజ్‌ కామెడీ డ్రామా తెరకెక్కింది. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్‌‌‌‌గా నటించగా, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై రాజేష్  నిర్మించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌‌‌‌‌‌‌‌, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ కూడా మార్చి 6న రానుంది.

కాన: ది ఫారెస్ట్:

ఆండ్రియా జెర్మియా కీ రోల్లో నటించిన లేటెస్ట్ హారర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'కాన: ది ఫారెస్ట్' (Kaa/Kaana). నంజిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఆండ్రియా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా కనిపించబోతుంది. అడవిలో మనుగడ సాగించే కష్టాలను, మిస్టరీని చూపే సర్వైవల్ డ్రామాగా రూపొందింది. శుక్రవారం మార్చి 6న థియేటర్లోకి రానుంది.

విధాత మూవీ:

భాస్కర్, కోటేశ్వర రావు ప్రధాన పాత్రల్లో మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వంలో అప్పినపల్లి భాస్కరాచారి నిర్మించిన మూవీ ‘విధాత’. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది.

‘మున్నా’ రీ రిలీజ్:

‘రెబల్ స్టార్’ ప్రభాస్ కెరీర్‌లో అత్యంత స్టైలిష్ యాక్షన్ డ్రామాగా నిలిచిన చిత్రం ‘మున్నా’. దాదాపు 19 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా.. మార్చి 6న రీ రీలిజ్ కానుంది. అత్యాధునిక 4K టెక్నాలజీతో, వెండితెరపై మరింత గ్రాండ్‌గా డార్లింగ్ ఫ్యాన్స్ ని అలరించనుంది.