యూత్ నుంచి వృద్ధుల వరకు ఇష్టపడే ఐ ఫోన్స్ లో మరో ఫోన్ యాపిల్ కంపెనీ ఇండియాలో లాంచ్ చేసింది. 17 సీరీస్ లో మరో ఫోన్ ను ఇండియాలో అందుబాటులోకి తెస్తోంది. iPhone 17e ని లాంచ్ చేసిన యాపిల్ కంపెనీ.. ప్రి-ఆర్డర్స్ మార్చి 4 సాయంత్రం 7:45 నుంచి స్టార్ట్ అవుతాయని పేర్కొంది. 11వ తేదీ నుంచి మొదలయ్యే సేల్స్ కు సంబంధించి 4వ తేదీ నుంచి బుక్ చేుసుకోవచ్చు. ఈ ఫోన్ ఫీచర్స్, కలర్ పర్ఫామెన్స్, ప్రైస్.. స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం.
ప్రైస్ రేంజ్:
17 సీరీస్ లోనే అఫర్డబుల్ ఫోన్ iPhone 17e. అంటే ప్రైస్ మరీ హై రేంజ్ కాకుండా.. సామాన్యులు కూడా కొనే రేంజ్ లోనే ఉన్నాయి. 8GBRAM తో వస్తున్న ఈ ఫోన్ లో 256GB స్టోరేజ్ ఫోన్ రూ.64 వేల 900 ఉండగా.. 512GB స్టోరేజ్ ఫోన్ రూ.84,900 ధరకు అందుబాటులోకి వచ్చాయి. దుబాయ్‌లో ఆపిల్ ఐఫోన్ 17e ధర AED 2,599 నుండి ప్రారంభమవుతుంది. యూఎస్ లో లో ఆపిల్ ఐఫోన్ 17e ధర 599 డాలర్స్ నుంచి ప్రారంభమవుతున్నాయి.
డిజైన్, కలర్ ఆప్షన్స్:
iPhone 17e గ్లాస్, మెటల్ చాసిస్ బిల్డ్ తో వచ్చింది. IP68 సర్టిఫికేషన్ ఇస్తున్నారు. ఫ్రంట్ ప్రొటెక్షన్స్ కోసం సిరామిక్ షీల్డ్ కలిగి ఉంటుంది. బ్లాక్, వైట్, సాఫ్ట్ పింక్ కలర్స్ లో వస్తున్న ఈ మోడల్.. లాంగ్ డ్యూరబుల్ గ్లాస్ తో ఇస్తున్నారు.
డిస్ప్లే:
6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 1.5k రెజొల్యుషన్, 800 nits ట్రైట్ నెస్ ఉంటుంది. అందులో 1200 nits HDR. రీఫ్రెష్ రేట్ 60Hz గా ఉంది.
పర్ఫామెన్స్:
iPhone 17e పర్ఫామెన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంది కంపెనీ. 4-core GPU తో A19 చిప్ కలిగి ఉంటుంది. C1X సెల్యులార్ మోడెం (C1 తో పోల్చితే 2x స్పీడ్) తో పనిచేస్తుంది. 8GB RAM, 256GB-512GB స్టోరేజ్ ఉటుంది. C1X 5G మోడెం ఉన్న ఈ ఫోన్ MagSafe చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
కెమెరా:
iPhone 17e 48MP సింగిల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. ((f/1.6 లెన్స్, OIS, 2x టెలిఫోటో మోడ్) ఫ్రంట్ కెమెరా 12MP (ట్రూడెప్త్, ఫేస్ ఐడీ), ఆడియో నైట్ మోడ్ తో కూడిన 4K డాల్బీ విజన్ ఈ ఫోన్ లో ఉంటుంది.
