Health Alert : మీ శరీరంలో.. ఈ భాగాల్లో మార్పులు వస్తుంటే.. కచ్చితంగా అనారోగ్యంగా ఉన్నట్లు.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే..!

Health Alert : మీ శరీరంలో.. ఈ భాగాల్లో మార్పులు వస్తుంటే.. కచ్చితంగా అనారోగ్యంగా ఉన్నట్లు.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే..!

మన శరీరం చాలా తెలివైనది. మనహెల్త్ కు ఏదైనా ఇబ్బందిరాబోతుంటే, దానికి ముందే తెలిసిపోతుంది. ఎన్నో హింట్స్ ఇస్తూ మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మనం శరీరం చెప్పేమాటలు వినాలి... వాటిని బేస్ చేసుకుని, జాగ్రత్తగా మసలుకోవాలి.లేదంటే పెద్ద ఇబ్బందులే ఎదురవుతాయి. ఆ హెచ్చరికలను లైట్ తీసుకుంటే, నేరుగా ఆస్పత్రికి రోజులను కేటాయించుకోవాల్సిందే.

మన శరీరం సిగ్నల్ ఇస్తుంది


మనకు వచ్చే చాలా అనారోగ్యసమస్యలు చెప్పాపెట్టకుండా. ఒక్కసారి వచ్చి మీద పడిపోవు వాటికి ఒక లెక్క ఉంటుంది. ముందుగానే సమాచారం ఇస్తాయి. కనిపెట్టుకుని జాగ్రత్తపడమని మనల్ని హెచ్చరిస్తాయి. వాటి మీద మనం. కన్నేసి ఉంచితే, ముందుగానే మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీనికి కావాల్సిందంతా... మన శరీరంలో వచ్చే చిన్నచిన్న మార్పులను మనం గమనించుకోవడమే..

నాలుక ముందే చెప్తుంది.

మనం అనారోగ్య సమస్యలకు దగ్గరగా ఉన్నట్లు మన నాలుక ముందుగానే చెప్పిస్తుంది. నాలుక ఇంచులు వాపులా కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో కింది దవడకంటే నాలుక పెద్దదిగా అవుతుంది. ఇది కేవలం వాపు మాత్రమే అయితే పర్వాలేదు. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే అదే తగ్గిపోతుంది. కానీ వాపుకు తోడు తీవ్రమైన నొప్పి, తిమ్మిరి ఎక్కువగా హెయిర్ లాస్ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇది థైరాయిడ్ కు ముందస్తు హెచ్చరిక అయ్యే అవకాశం ఉంది.

గోళ్ళపై నల్లగా...

మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో చెప్పడంలో మన గోళ్లు కూడా 'కీరోల్ పోషిస్తాయి. ఒక్కోసారి గోళ్లపై నల్లని గీతలు ఏర్పడతాయి. లైట్ తీసుకోవాల్సిన విషయం కాదు. నిలువుగా గోధుమరంగులో గీతలు ఏర్పడితో అది మెలనోమాకు దారితీసే అవకాశం! ఉంది. ఆ గీతలను గమనించగానే ఆలస్యం చేయకుండా డాక్టర్​ ను కలవాలి. ఎంత లేట్ చేస్తే, సమస్య ప్రభావం అంత ఎక్కువయ్యే. అవకాశం ఉంది.

స్కిన్ చెప్పేస్తుంది...

మనం ఎంత మేరకు ఆరోగ్యంగా ఉన్నామో చెప్పడంలో స్కిన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. డయాబెటిస్ కు సంబంధించిన హెచ్చరికలను మన చర్మం ముందే చెప్పేస్తుంది. స్కిన్ మీద వాపు రావడాన్ని, రంగుమారడాన్ని,పసుపురంగు మచ్చలు వంటి వాటిని గమనిస్తే.. లైట్ తీసుకోవద్దు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే. డాక్టర్​ను కలవడం ఉత్తమం. ఈ లక్షణాలకు మనల్ని డయాబెటీస్ కు దగ్గర చేసే అవకాశాలు ఉన్నాయి.

కనుబొమలు రాలుతుంటే...

చాలామంది జట్టు రాలడాన్ని సీరియస్ గా తీసుకుంటారు. కానీ కనుబొమలు  పలచనవ్వడాన్ని పట్టించుకోరు. నిజానికి జుట్టు రాలడం కంటే, ఇది పెద్ద సమస్య వయసు మీద పడుతున్నప్పుడు జుట్టు రాలడం చాలా కామన్ విషయం దాన్ని లైట్ తీసుకోవచ్చు. కానీ ఏ వయసువారికైనా, కనుబొమలు  రాలడం మాత్రం చిన్న విషయం కాదు. దానికి మన హెల్త్ కు సంబందించిన వార్నింగ్ గానే చూడాలి. ఇది థైరాయిడకు దారితీసే అవకాశం ఉంది. కనుబొమలు రాలుతున్నట్టుగా, పలచబడుతున్నట్లుగా గమనిస్తే, వీలైనంత త్వరగా డాక్టర్​ ను  సంప్రదించాలి.

వాటితో ఇబ్బందే...

పింపుల్స్ చాలా కామన్ విషయం జీవితంలో ఒక్కసారైనా వీటి బారిన పడని వాళ్లు ఉండరు. కొందరిలో వీటి మోతాదు ఎక్కువగా, ఇంకొందరిలో తక్కువగా ఉంటుంది. అయితే ఒక్కోసారి... చూడటానికి ముత్వంలా ఉండే పింపుల్స్ మనల్ని ఇబ్బంది పెడతాయి. కొన్ని వారాలపాటు వదిలిపెట్టవు. వాటి నుంచి రక్తస్రావం అవుతుంది. వీటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది బేసల్ సెల్ క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది. ఇది అంత ఇబ్బంది పెట్టిదేమీ కాదు. ముందుగానే గుర్తుపడితే దీన్ని నయం చేసుకోవడం సులభం.

డార్క్ సర్కిల్స్....

ఈరోజుల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్, కనిపించడం చాలా కామన్ విషయం అయితే దీన్ని అంత తేలికగా తీసుకోకూడదు. ఇవి వచ్చాయంటే... మన లైఫ్ స్టయిల్​ మార్చుకోమని మన శరీరం మనకు గట్టిగానే దివున్నట్టు అర్థం చేసుకోవాలి. తగినంత నిద్రఉండేలా చూసుకోవాలి. సరైన డైట్ ఫాలో అన్నాలి. లేదంటే చాలా హెల్త్ ఇష్యూస్​ను  ఫేస్ చేయడానికి సిద్ధపడే ఉండాలి.

ఇలా ఎన్నో రకాలుగా మన శరీరంమనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. వాటిని పట్టించుకుని జాగ్రత్త పడితే మనల్ని మనం కాపాడుకోవచ్చు. మనం మన లైఫ్ లో బిజీగా ఉండాలా, హాస్పిటల్ బెడ్ మీద ఉండాలా అనే విషయం... మనం మనపైన తీసుకునే కేరే డిసైడ్ చేస్తుంది.