ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ తెలుగు నేర్పించాలి : గవర్నర్

ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ తెలుగు నేర్పించాలి : గవర్నర్

మాతృభాష మన జీవితంలో అవసరమని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. మాతృభాష మన చైతన్యంతో ముడిపడి ఉంటుందని చెప్పారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళి సై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ తెలుగు నేర్పించాలని సూచించారు. ఇలాంటి పండుగ జరగడం ఎంతో ఆనందంగా ఉందని ఇది కన్నుల పండుగ అని వ్యాఖ్యానించారు. 

తెలుగు మాట్లాడేవాళ్లు ప్రపంచ దేశాలలో వివిధ రాష్ట్రాలలో ఉన్నారని తమిళి సై తెలిపారు. తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించి, సామాన్య ప్రజలు కొని చదివే విధంగా ఉండాలని తెలిపారు. తన మాతృభాషా తమిళమని తాను తమ సోదర భాష తెలుగు మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ ఏమి ఉండదని శ్రమ ఆధారంగా ప్రగతి వస్తుందని తెలిపారు.