
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం కోట్ల మంది హృదయాలను కలచివేసింది. లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలోని 274 మంది ప్రాణాలు రెప్పపాటులో గాలిలో కలిసిపోయాయి. అయితే.. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడాడు.11ఏ నంబర్ సీట్లోని ప్యాసింజర్ విశ్వాస్ కుమార్ రమేశ్ (40) ప్రమాదం నుంచి సజీవంగా బయటపడిన సంగతి తెలిసిందే. 11ఏ సీటులో కూర్చోవడం వల్లే విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డాడని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే.. ఈ 11ఏ సీటు అంత సేఫ్ అవునో.. కాదో కాసేపు పక్కనపెడితే 27 ఏళ్ల క్రితం కూడా సరిగ్గా ఇలానే జరిగింది.
ఇంత ఘోర ప్రమాదంలో 11ఏ సీటులో కూర్చున్న విశ్వాస్ ప్రాణాలతో బయటపడ్డాడని తెలిసి థాయ్‌లాండ్‌కు చెందిన నటుడు, గాయకుడు అయిన రుయాంగ్‌సాక్ తాను చవిచూసిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. డిసెంబర్ 11, 1998లో రుయాంగ్‌సాక్ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. థాయ్ ఎయిర్ వేస్ ఫ్లైట్ నంబర్ TG261 ఎక్కాడు. ల్యాండింగ్ సమయంలో రుయాంగ్‌సాక్ ఎక్కిన విమానం చిత్తడి నేలలో కూరుకుపోయి కుప్పకూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 146 మంది ఉన్న విమానంలో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అలా ప్రాణాలతో బయటపడిన వాళ్లలో రుయాంగ్‌సాక్ ఒకడు. రుయాంగ్‌సాక్ సీటు నంబర్ కూడా 11Aనే కావడం ఇక్కడ కొసమెరుపు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి తెలిసి రుయాంగ్‌సాక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
►ALSO READ | Ahmedabad Plane Crash: 48 గంటల తర్వాత.. విమాన ప్రమాదంలో దొరికిన మరో డెడ్ బాడీ.. !
11A సీటు నంబర్లో ఉన్న వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసి తన సీటు నంబర్ కూడా 11Aనే అని రుయాంగ్‌సాక్ గుర్తుచేసుకున్నాడు. ఆ విమాన ప్రమాదంలో తాను బతికి బయటపడినప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోవడానికి తనకు పదేళ్లకు పైగానే పట్టిందని రుయాంగ్‌సాక్ ఆ ఘటనను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు. ఇదిలా ఉండగా.. విమానంలో 11A సీటులో కూర్చుంటే ఎంత ఘోర విమాన ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడే ఛాన్స్ ఉంటుందనే వాదనను ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ డైరెక్టర్ మిచెల్ ఫాక్స్ కొట్టిపారేశారు. అన్ని విమాన ప్రమాదాలు ఒకేలా ఉండవని, సీట్ లొకేషన్ బట్టి ప్రాణాలు దక్కించుకోవచ్చని చెప్పగలగడం అసాధ్యమని ఆయన చెప్పారు. బోయింగ్ 787 విమానంలో 11A సీట్ లొకేషన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉందని.. అన్ని విమానాల్లో 11A సీట్ అలానే ఉండదని తెలిపారు.