నేను బతికే ఉన్నా.. అప్పుడే చంపేయకండి: బాలీవుడ్ నటి

నేను బతికే ఉన్నా.. అప్పుడే చంపేయకండి: బాలీవుడ్ నటి

ప్రముఖ టెలివిజన్ షో తప్కీ ప్యార్(Thapki Pyaar) తో ఎంట్రీ ఇచ్చిన నటి జిగ్యాసా సింగ్(Jigyasa Singh). ఈ షో కంటిన్యూ సీజన్ తప్కీ ప్యార్ కి 2 లో కూడా జిగ్యాసా నటించింది.ఈ షోలో వాణి అనే పాత్ర పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. రీసెంట్ గా జిగ్యాసా సింగ్ మరణించినట్లు సోషల్ మీడియాలో కొన్ని మెసేజెస్ వైరల్ అవుతున్నాయి. కాగా చనిపోయిందని తప్పుగా పేర్కొన్న యూట్యూబ్ వీడియో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది జిగ్యాసా. 

ఆ యూట్యూబ్ స్క్రీన్ షార్ట్ లో ..తప్కీ ప్యార్ ఫేమ్ జిగ్యాస మరణించింది..అంటూ కొన్నిశీర్షికలతో వీడియోలు చూపించబడ్డాయి. ఆమె కారు ప్రమాదంలో చనిపోయిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..నెటిజన్లు నివాళులర్పించారు. 'రెస్ట్ ఇన్ పీస్', 'RIP జిగ్యాస' అండ్  "ఓం శాంతి," అంటూ కొన్ని వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. 

దీంతో వెంటనే రియాక్ట్ అయిన జిగ్యాసా సింగ్.. ఈ వీడియోల్లో చూపించింది అంతా..ఫేక్ న్యూస్. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తులను తీవ్రంగా ప్రశ్నిస్తూ.. "అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయి? అంటూ నవ్వు ఎమోజిని పెడుతూ..అబ్బాయిలు, నేను బతికే ఉన్నాను! మీరు..అద్భుతం అద్భుతం! నకిలీ ఛానెల్‌లలో ఈ నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ఆపండి" అని ఆమె క్యాప్షన్‌లో రాసింది. దీంతో వైరల్ అవుతున్న పుకార్లకు ఎండ్ కార్డు పడినట్లయింది. 

తప్కీ ప్యార్ రెండవ సీజన్ మధ్యలోనే కొన్నిహెల్త్ ఇస్స్యూస్ ఉండటంతో..ఈ షోకి దూరమైంది. ఈ షోతో పాటు జిగ్యాసా సింగ్ 'శక్తి - అస్తిత్వ కే ఎహసాస్ కీ' షోతో సహా ఇతర టెలివిజన్ నాటకాలలో కనిపించింది.అలాగే ఒకటి లేదా రెండు మ్యూజిక్ వీడియోలలో కనిపించి ఆడియన్స్ కి స్పెషల్ అట్ట్రాక్టీవ్ గా మారింది. కాగా జిగ్యాసా సింగ్ కొంతకాలం టెలివిజన్ షోస్ కి దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో రెగ్యులర్ ఇంటరాక్షన్‌ల ద్వారా తన అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jigyasa Singh (@jigyasa_07)