తండ్రి రూపంతో ఉన్న.. హీరోల ప్రేమలో హీరోయిన్స్.. ఆసక్తికరంగా మామా మశ్చీంద్ర ట్రైలర్

తండ్రి రూపంతో ఉన్న.. హీరోల ప్రేమలో హీరోయిన్స్.. ఆసక్తికరంగా మామా మశ్చీంద్ర  ట్రైలర్

సినిమా, సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ కొత్త తరహా స్ర్కిప్టులను సెలెక్ట్ చేసుకుంటున్నాడు హీరో సుధీర్ బాబు(Sudheer Babu). ఇప్పుడు ఏకంగా మూడు డిఫరెంట్ గెటప్స్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నటుడు, రచయిత హర్షవర్ధన్ (HarshaVardhan) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’(Maama Mascheendra). ఇందులో సుధీర్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు.

లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ని సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్ని చూస్తుంటే మామ, మేనల్లుడు మధ్య జరిగే ఒక రివెంజ్ డ్రామా స్టోరీ అని తెలుస్తుంది. మేనల్లుడలకి మేనమామ పోలిక రావడం, ఆ మావయ్య కూతుళ్లు..తన తండ్రి రూపంతో ఉన్న హీరోలతో ప్రేమలో పడడం, ఆ తరువాత ఏం జరిగిందనేది కథని అర్ధమవుతుంది. 

ఈ మూవీలో సుధీర్ బాబు హెవీ వెయిట్ ఉన్న ‘దుర్గ’గా, ఓల్డ్‌‌ డాన్‌‌ ‘పరశురామ్’గా ..అలాగే ‘డీజే’ అనే మరో స్టైలిష్ లుక్స్ తో అక్కటుకుంటున్నారు. ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్స్‌‌గా నటిస్తుండగా..అభినయ, హర్ష వర్ధన్, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

Also Read :- విధ్వంసానికి కొత్త అర్థం.. రవితేజ ఈగల్ నుండి మాస్ అప్డేట్

మామా మశ్చీంద్ర తెలుగు, హిందీ భాషల్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో రూపొందుతుంది. కాగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్స్ సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌‌ మోహన్‌‌రావు నిర్మిస్తున్నారు.  మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ..వచ్చే నెల (అక్టోబర్ 6న) థియేటర్ లలో రిలీజ్ కానుంది. 

డైరెక్టర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో రూపొందిస్తున్న ఈ మూవీ ట్రైలర్ విభిన్నంగా కనిపిస్తోంది. సుధీర్ బాబు ఎస్ఎంఎస్ అనే సినిమాతో తెలుగు ఇండిస్టీకి హీరోగా పరిచయమై..క్రమక్రమంగా డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుకున్నాడు.