విధ్వంసానికి కొత్త అర్థం.. రవితేజ ఈగల్ నుండి మాస్ అప్డేట్

విధ్వంసానికి కొత్త అర్థం.. రవితేజ ఈగల్ నుండి మాస్ అప్డేట్

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ఈగల్(Eagle). ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. మరో బ్యూటీ కావ్య తాపర్(Kavya tapar) కీ రోల్ లో కనిపిస్తోంది. 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. ఈగల్ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదే విషయాన్నీ అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ కూడా చాలా స్టైలీష్ అండ్ క్యూరియస్ గా ఉండటంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

ఇక ఈగర్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దావ్జాండ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేతున్నారు. మరి ఈ సినిమా రవితేజ కెరీర్ లో ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి మరి.