ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన OG మేకర్స్..

ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన OG మేకర్స్..

డైరెక్టర్ సుజీత్(Sujeeth)..చిన్న వయసులోనే తనదైన టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. రన్ రాజా రన్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి..కూల్ హిట్ అందుకున్నారు. మొదటి సినిమా తోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సుజీత్‌.. ఆ ఒక్క సినిమా అనుభవంతోనే ఏకంగా ప్రభాస్ తో సాహో వంటి పాన్ ఇండియా మూవీని తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawankalyan) హీరోగా మాఫియా నేపథ్యం లో రూపొందుతున్న ఓజీ(OG) సినిమా ని ఓ రేంజ్ లో రూపొందిస్తున్న డైరెక్టర్ సాహో సుజీత్‌ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 26). ఓజీ మూవీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్( DVV Entertainments) సుజీత్ బర్త్డే స్పెషల్గా శుభాకాంక్షలు చెబుతూ..'పవర్ స్టార్ విశ్వరూపంతో..మీరు ఆనందంగా ఉండండి. మీ యొక్క అద్భుత మేకింగ్తో ఫ్యాన్స్ను ఉత్తేజపరచండి అంటూ..డైరెక్టర్ సుజీత్ యొక్క పోస్టర్ను రిలీజ్ చేశారు. 

డైరెక్టర్ సుజీత్ తీసిన సాహో మూవీకి తెలుగులో అంత పాజిటివ్ వైబ్ రాకపోయినప్పటికీ..బాలీవుడ్‌లో మాత్రం బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు పవన్తో తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా కూడా బాలీవుడ్‌ ఆడియన్స్కి పిచ్చెక్కిస్తుందని హంగ్రీ చీతా మాస్ గ్లింప్స్తో అర్ధమైపోయింది.

ఓజీ  మూవీలో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ ఉంటాయని క్లియర్ గా అర్థమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ KGFని మించిన ఎలివేషన్స్ కూడా ఉంటాయట. అది కూడా పది రెట్లు పవర్ ఫుల్ గా. తనదైన వర్సటైలిటీ డైరెక్షన్ తో సుజీత్ OG మూవీని ఎలా చెక్కుతున్నాడనేది ఫ్యాన్స్ కి సస్పెన్స్ గా మారింది. 

ఓజీ సినిమా విషయానికి వస్తే..బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో చిత్రీకరణ తో బిజీగా ఉన్నారు డైరెక్టర్ సుజీత్. కొంతమేరకు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ కారణాల వల్ల..షూటింగ్ కు కాస్తా ఇబ్బంది నెలకొనడంతో ఓజీ సినిమా విషయంలో డిలే అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ మూవీ అయిపోయాకే..మరో సినిమాను టచ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.