OTT Political Thriller: రాజీవ్ గాంధీ హత్య కేసుపై వెబ్ సిరీస్‌.. ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్

OTT Political Thriller: రాజీవ్ గాంధీ హత్య కేసుపై వెబ్ సిరీస్‌.. ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నేపథ్యంలో వస్తున్న వెబ్ సిరీస్‌‌ ‘ది హంట్: రాజీవ్‌‌ గాంధీ అసాసియేషన్‌‌ కేస్‌‌’.నగేష్ కుకునూర్ దీనికి దర్శకుడు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌‌ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు.

‘రాజీవ్ గాంధీ బ్రతికే ఉన్నారా’అంటూ కొలంబోలోని ఇండియన్‌‌ హై కమిషన్‌‌ ఆఫీస్‌‌కు అన్‌‌నౌన్‌‌ ఫోన్ కాల్ రావడంతో మొదలైన ట్రైలర్‌‌‌‌.. ఆ తర్వాత హత్యపై జరిగిన దర్యాప్తు నేపథ్యంలో సాగింది.

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌‌‌‌లో జరిగిన బహిరంగ సభలో శ్రీలంక ఎల్‌‌టీటీఈకి చెందిన ఆత్మాహుతి బాంబర్‌‌‌‌ ద్వారా రాజీవ్‌‌ గాంధీని హత్య చేసిన విషయం తెలిసిందే.

అప్పట్లో దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన ఈ ఇన్సిడెంట్‌‌కు సంబంధించి జరిగిన దర్యాప్తు, 90 రోజుల్లో హంతకులను ఎలా పట్టుకున్నారు అనేది ఈ సిరీస్‌‌ మెయిన్‌‌ కాన్సెప్ట్‌‌. అప్లాజ్‌‌ ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌ సమర్పణలో కుకునూర్ మూవీస్‌‌ నిర్మించిన ఈ వెబ్ సిరీస్.. జులై 4 నుంచి సోనీ లీవ్‌‌లో స్ట్రీమింగ్ కానుంది.