ఉస్మానియాకు ఆసుపత్రికి మైనర్ నిందితులు

ఉస్మానియాకు ఆసుపత్రికి మైనర్ నిందితులు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అఘాయిత్య ఘటనలో మైనర్ నిందితులను జువైనల్ హోం నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మూడు ప్రైవేట్ కార్లలో  నిందితుల్ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారికి ఇక్కడ లైంగిక సామర్థ్య పరీక్షలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో వైద్య బృందం సాదిద్దున్ మాలిక్ తో పాటు ఐదుగురు మైనర్ నిందుతులకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖాలకు మాస్కులు వేసి ఒక్కొక్కరిని ఫోరెన్సిక్ విభాగంలోకి ల్యాబ్ లోకి తరలించారు.  ఇక వైద్య పరీక్షలకు సుమారు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మెడికల్ టెస్ట్ అనంతరం మైనర్ నిందితులను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు.