రజనీ, షారుఖ్ రికార్డులను బద్దలు కొట్టిన రణవీర్ సింగ్.. 'ధురంధర్' ప్రాఫిట్ షేరింగ్‌ ఎన్ని వందల కోట్లంటే?

 రజనీ, షారుఖ్ రికార్డులను బద్దలు కొట్టిన రణవీర్ సింగ్.. 'ధురంధర్' ప్రాఫిట్ షేరింగ్‌ ఎన్ని వందల కోట్లంటే?

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన హై-వోల్టేజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజీ 'ధురంధర్' (Dhurandhar)  రెండు భాగాలు ఇండియన్ సినీ ఇండస్ట్రీ షేక్ చేశాయి. అదే  రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద  రూ. 3,200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.  వచ్చిన లాబాల్లో తన వాటాగా ఏకంగా రూ. 325 కోట్లను రణవీర్ సింగ్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఒక్క దెబ్బతో భారతీయ చలనచిత్ర రంగాన్నే తనవైపు తిప్పుకున్నారు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అగ్ర హీరోల రికార్డులన్నింటినీ రణవీర్ బద్దలు కొట్టారు.

నో ఫిక్స్డ్ రెమ్యునరేషన్.. 

సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ఒప్పుకుంటే కోట్లల్లో ఫిక్స్డ్ ఫీజ్ డిమాండ్ చేస్తారు. కానీ రణవీర్ సింగ్ ఇక్కడ పక్కా బిజినెస్ మైండ్‌తో ఆలోచించారు. ఆయన ఎలాంటి ముందస్తు పారితోషికం తీసుకోకుండా.. ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌ను ఎంచుకుని ఒక పెద్ద సాహసమే చేశారు. సినిమా బడ్జెట్ పెరుగుతున్న సమయంలో వెనకడుగు వేయకుండా, తన సొంత డబ్బును కూడా ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకున్నారు.

►ALSO READ | బాక్సాఫీస్ వద్ద సమంత వసూళ్ల సునామీ.. 'మా ఇంటి బంగారం' కలెక్షన్లపై నయనతార క్రేజీ పోస్ట్!

ఈ క్రేజీ స్మార్ట్ మూవ్ వల్ల సినిమా థియేట్రికల్ కలెక్షన్లతో పాటు ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా వచ్చిన లాభాల్లో రణవీర్‌కు సింహభాగం దక్కింది. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఆయన పెట్టిన పెట్టుబడి, నమ్మకానికి వంద రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. ఈ మూవీ కలెక్షన్లలో తన లాభాల వాటా కింద ఏకంగా రూ. 325 కోట్లు తీసుకుని ఆల్‌టైమ్ రికార్డ్ సంపాదనను అందుకున్నారు.

బాక్సాఫీస్ బాద్‌షాల రికార్డులు గాల్లోకి..

ఈ ఒక్క సినిమాతో రణవీర్ సింగ్.. ఇండియన్ సినిమా టాప్ లీగ్‌లో ఉన్న సీనియర్ సూపర్ స్టార్లను వెనక్కి నెట్టేశారు. అంతకుముందు వరకు ఉన్న రికార్డులను తడిసిపెట్టేశారు. రణవీర్ సింగ్ దురంధర్ రెండు పార్టులకు గాను రూ. 325 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ నుంచి రూ. 250 కోట్లు లాభాల్లో వాటా కింద తీసుకున్నారు. 

ఇక బాలీవుడ్ బాద్ షా  షారుఖ్ ఖాన్  'పఠాన్', 'జవాన్' వంటి చిత్రాలకు ఒక్కోదానికిరూ. 200 కోట్లు , ప్రభాస్ 'కల్కి2898 AD 'నుంచి రూ. 200 కోట్లు , అల్లు అర్జున్ 'పుష్ప 2'  నుంచి రూ . 200  కోట్లకు పైగా లాభాల్లో వాటా కింద తీసుకున్నట్లు సమాచారం. అయితే సినిమా ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌లో రిస్క్ చాలా ఎక్కువ. మూవీ ఫ్లాప్ అయితే రూపాయి కూడా రాదు, కానీ 'ధురంధర్' లాంటి మెగా హిట్ పడితే మాత్రం ఇలాంటి ఊహించని సంచలనాలు నమోదవుతాయి.

 మొత్తానికి రణవీర్ సింగ్ కేవలం నటుడిగానే కాకుండా ఒక తెలివైన బిజినెస్ పార్ట్నర్‌గా మారి బాలీవుడ్ కమర్షియల్ మార్కెట్ రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. 'ధురంధర్' సక్సెస్ ఇండియన్ యాక్టర్ల రెమ్యునరేషన్ లెక్కలను పూర్తిగా మార్చేసి కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.