ఓటీటీలోకి వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. 'ది మమ్మీ' స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. 'ది మమ్మీ' స్ట్రీమింగ్ ఎక్కడంటే?

90స్ కిడ్స్‌కి ‘ది మమ్మీ’ (The Mummy) సినిమా అంటే ఒక ఎమోషన్. ఆ రోజుల్లో టీవీల్లో ఈ సినిమా వస్తే టీవీలకే అతుక్కుపోయేవారు. అయితే, అప్పట్లో వచ్చిన మమ్మీ సినిమాలన్నీ అడ్వెంచర్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా సాగాయి. కానీ, ఇప్పుడు వస్తోన్న సరికొత్త ‘ది మమ్మీ’ మాత్రం రూట్ మార్చింది. పూర్తి డార్క్ హారర్, మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో మిమ్మల్ని వెన్నులో వణుకు పుట్టించడానికి వచ్చేసింది..

హారర్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు లీ క్రోనిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, హారర్ జోనర్‌లో బ్రాండ్ అంబాసిడర్స్ అయిన జేమ్స్ వాన్, జేసన్ బ్లమ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లైయా కోస్టా, జాక్ రేనార్, వెరోనికా ఫాల్కన్, మే కలామావి ముఖ్య పాత్రలు పోషించారు.

కథేంటంటే?

ఈ సినిమా కథ పాత మమ్మీ సినిమాలకు పూర్తిగా భిన్నం. ఈజిప్ట్ ఎడారిలో ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన ఒక అమ్మాయి, హఠాత్తుగా తన కుటుంబం వద్దకు తిరిగి వస్తుంది. కూతురు దొరికిందని ఆ కుటుంబం సంతోషించేలోపే వారికి అసలు సినిమా కనిపిస్తుంది. ఆమె రూపంలో వచ్చింది తమ కూతురు కాదు.. ఒక పురాతన రాక్షస శక్తి  అని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ కుటుంబం ఎలాంటి నరకాన్ని చూసింది? ఆ మమ్మీ శపించిన శక్తుల నుండి ఎలా తప్పించుకుంది? అనేదే మెయిన్ స్టోరీ.

ఓటీటీ ట్విస్ట్!

గత నెల ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చి హారర్ లవర్స్‌ను భయపెట్టిన ఈ చిత్రం, ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. హాలీవుడ్ దిగ్గజ సంస్థ 'వార్నర్ బ్రదర్స్' ప్రకటించిన ప్రకారం.. ఈ రోజు (మే 19, 2026) నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఫాండాంగో అట్ హోమ్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో ప్రీమియం వీడియో-ఆన్-డిమాండ్ (PVOD) పద్ధతిలో రెంట్‌కు అందుబాటులోకి వచ్చింది.

►ALSO READ | కనిపించకుండా పోయిన లేడీ సింగర్.. వారం తర్వాత కాలువలో డెడ్ బాడీ !

అయితే ప్రస్తుతం విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం, త్వరలోనే భారతీయ ఓటీటీ స్క్రీన్లపైకి డిజిటల్ ప్రీమియర్ కానుంది. మన దేశంలోకి వచ్చేసరికి తెలుగు డబ్బింగ్‌తో పాటు హై-క్వాలిటీ 4K అల్ట్రా HD వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. థ్రిల్ అండ్ హారర్ ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు..