Rajinikanth: 'ది ఓజీ స్వాగ్'.. ఆపరేషన్ థియేటర్‌లో రౌడీల ఊచకోత.. 'ధర్మన్'గా రజనీకాంత్ విధ్వంసం!

Rajinikanth: 'ది ఓజీ స్వాగ్'.. ఆపరేషన్ థియేటర్‌లో రౌడీల ఊచకోత.. 'ధర్మన్'గా రజనీకాంత్ విధ్వంసం!

దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ సరికొత్త సంచలనానికి తెరలేపారు. రజనీకాంత్ హీరోగా,  కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక 173వ చిత్రం టైటిల్‌ను అధికారికంగా నిన్న ( జూన్ 24, 2026 ) ప్రకటించారు. ఈ చిత్రానికి 'ధర్మన్' (Dharman) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ.. 'ది డెడ్లీ డాక్టర్' అనే ట్యాగ్‌లైన్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు.

'ది ఓజీ స్వాగ్'

లేటెస్ట్ గా చిత్రబృందం 'ది ఓజీ స్వాగ్' మేకింగ్ వీడియోను  విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆపరేషన్ థియేటర్‌లో చేతిలో సర్జికల్ బ్లేడ్ పట్టుకుని, కింద పడి ఉన్న విలన్‌పై కాలు పెట్టి రజనీ ఇచ్చిన సీరియస్ లుక్ చూస్తుంటే.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో తలైవా న్యాయం కోసం ఎంతటి సాహసానికైనా తెగించే ఓ వైవిధ్యమైన డాక్టర్ పాత్రలో రౌడీలను ఊచకోత కోయబోతున్నట్లు తెలుస్తోంది.

క్రేజీ కాంబినేషన్స్..

ఈ ప్రాజెక్ట్ మొదట సుందర్ సి, ఆ తర్వాత సిబి చక్రవర్తి చేతులు మారి.. చివరకు 'ఓ మై కడవులే', 'డ్రాగన్' ఫేమ్ అశ్వత్ మారిముత్తు చేతుల్లోకి వచ్చింది. రజనీకి వీరాభిమాని అయిన అశ్వత్, తలైవాను ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో ఈ పోస్టరే చెబుతోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సీనియర్ నటి సిమ్రాన్, గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్స్ 'అన్బరివ్' మాస్టర్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

ALSO READ : వెండితెరపై మీర్జాపూర్ గ్యాంగ్..

గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'ధర్మన్'.. రజనీ మార్క్ స్టైల్, ఎమోషన్స్, సోషల్ మెసేజ్ కలబోసిన విజువల్ ట్రీట్‌గా ఉండబోతోంది. 'ధర్మమే గెలుస్తుంది' అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేయడంతో.. ఈ ఇద్దరు లెజెండ్స్ కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తలైవా క్రేజీ లుక్ చూశాక, అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.