'ది ప్యారడైజ్' నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్.. 'యేష నాగుల'తో శివమెత్తించిన నాని-కీర్తి సురేష్!

'ది ప్యారడైజ్' నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్.. 'యేష నాగుల'తో శివమెత్తించిన నాని-కీర్తి సురేష్!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, డైనమిక్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్'. 'దసరా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల డల్లాస్ లో జరిగిన భారీ మ్యూజిక్ కాన్సెర్ట్‌లో విడుదలైన సెకండ్ సింగిల్ 'యేష నాగుల కట్ట మీద..' ఆడియో ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తుంది. 

లేటెస్ట్ గా మేకర్స్ దీనికి సంబంధించిన ఫుల్ లిరికల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఊరమాస్ సాంగ్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది.   అచ్చమైన తెలంగాణ జానపద బాణీకి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన మాస్ బీట్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అందించిన ఊపుతెప్పించే సాహిత్యానికి జంగి రెడ్డి, ప్రభ తమ ఎనర్జిటిక్ గొంతుతో ప్రాణం పోశారు.

ఇక డాన్స్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ అందించిన మాస్ కొరియోగ్రఫీకి నానితో పాటు స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన కీర్తి సురేష్ వేసిన ఊరమాస్ స్టెప్పులు నెటిజన్లను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పాట విడుదల విషయంలో కొద్దిసేపు ఆలస్యం జరిగి అభిమానుల్లో ఉత్కంఠ పెంచినప్పటికీ, వీడియో బయటకు రావడంతో ఆ నిరీక్షణకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కామెంట్స్ వస్తున్నాయి. 

ALSO READ : 'ఆటలో కాదు.. ఆటే సవాల్'.. 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' గ్రాండ్ లాంచ్ ముహూర్తం ఫిక్స్!

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ పవర్‌ఫుల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ముగించుకుంటున్న 'ది ప్యారడైజ్' మూవీ త్వరలోనే పూర్తిస్థాయి ప్రమోషన్లను షురూ చేయనుంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా బహుళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం సినీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.