Eagle Movie: మాస్ మహారాజా ఫ్యాన్స్..మాసివ్ ఆటో ర్యాలీ

Eagle Movie: మాస్ మహారాజా ఫ్యాన్స్..మాసివ్ ఆటో ర్యాలీ

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో వస్తోన్న మాస్ రాజా రవితేజ (Ravi Teja) లేటెస్ట్ మూవీ ఈగల్ (Eagle). రేపు (ఫిబ్రవరి 9న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతుంది.మాస్ రాజా నుంచి వస్తోన్న స్పై థ్రిల్ల‌ర్‌ ఫిల్మ్ కావడమే కాకుండా..టీజర్ ట్రైలర్లో చూపించిన ఎలిమెంట్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. అంతేకాకుండా రవితేజ తన ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ఈ సినిమాలో అన్నివిధాలుగా ప్రయత్నించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. 

లేటెస్ట్గా రవితేజ ఫ్యాన్స్ వినూత్నమైన ప్రమోషన్స్ చేసిన వీడియోను నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) పోస్ట్ చేసింది. అనంతపురం వీధులన్నీ మాస్ మహారాజా అభిమానులతో హోరెత్తాయి..భారీ ఆటో ర్యాలీ తో చేసిన తీరు ఎంతోగాను ఆకట్టుకుందని తెలిపారు.

ఈ వీడియోలో కొన్ని ఆటోలు..ఒకటిగా ఏర్పడి ఇంగ్లీష్ లో ఈగల్ టైటిల్ వచ్చేలా చేసిన తీరు ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన  ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొండోడి మాస్ విస్ఫోటనం రేపు థియేటర్లలో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని దర్శకత్వం వహించాడు.రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు. నవదీప్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.