
దర్శకుడు ఎం మణికందన్(M Manikandan).. ఈ తమిళ దర్శకుడు కాక్కా ముట్టై, కడైసి వివసాయి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఈ రెండు సినిమాలకు గాను ఆయనకు నేషనల్ అవార్డ్స్ కూడా వరించాయి. అయితే ఇటీవల ఈ దర్శకుడి ఇంట్లో దొంగలు పడ్డారంట. మధురై ఉసియాంపట్టిలో ఈ ఘటన జరుగగా.. ఆ సమయంలో ఆయన కుటుంబంతో చెన్నైలో ఉన్నారట.
అయితే దొంగలు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో సహా.. ఎం మణికందన్ కు వచ్చిన నేషనల్ అవార్డ్ మెడల్స్ ను కూడా దొంగిలించారట. ఈ విషయంలో ఉసిలంపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసారు దర్శకుడు ఎం మణికందన్. పోలీసులు దర్యాప్తు కూడా మొదలుపెట్టారు. అయితే కొన్ని రోజులతరువాత మణికందన్ ఇంటి గేటుకి ఒక పాలిథిన్ కవర్ వేలాడుతూ కనిపించిందట. అది తీసి చూడగా అందులో ఆ దర్శకుడి రెండు నేషనల్ అవర్స్ మెడల్స్, ఒక లెటర్ కనిపంచాయట.
ఆ లెటర్ లో.. మమ్మల్ని క్షమించండి సర్.. ఇది మీ కృషి.. అని రాసి ఉందట. అయితే.. అవార్డులు తిరిగి ఇచ్చిన దొంగలు బంగారు ఆభరణాలు, డబ్బులు మాత్రం ఇవ్వలేదట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు ఏడాది జైలు