మూడో టెస్టు డ్రా.. ఆసీస్‌ను చిర్రెత్తించిన విహారి, అశ్విన్

మూడో టెస్టు డ్రా.. ఆసీస్‌ను చిర్రెత్తించిన విహారి, అశ్విన్

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టును టీమిండియా డ్రా చేసుకుంది. మ్యాచ్‌‌ను గెలవాలని ఆసీస్ చేసిన ప్రయత్నాలను నీరుగార్చింది. హనుమ విహారి (161 బాల్స్‌‌లో 23), రవిచంద్రన్ అశ్విన్ (128 బాల్స్‌లో 39) జట్టును గట్టెక్కించారు. వీళ్లిద్దరి సమర్థమైన డిఫెన్స్‌‌కు ఆసీస్ బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ముఖ్యంగా విహారి మరో ద్రవిడ్‌‌లా, నయా వాల్ పుజారను తలపిస్తూ సాలిడ్ డిఫెన్స్‌‌తో కంగారూలను చిర్రెత్తించాడు. స్టార్క్, హాజెల్‌‌వుడ్, కమిన్స్, లయన్ ఎంత ప్రయత్నించినా వీరిని ఔట్ చేయలేకపోయారు. విహారి-అశ్విన్ జోడీ దాదాపు 43 ఓవర్ల పాటు క్రీజులో నిల్చోవడం విశేషం. ఆట ముగిసేసమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 334 రన్స్ చేసింది. అంతకుముందు రిషబ్ పంత్ (118 బంతుల్లో 97), పుజారా ( 205 బంతుల్లో 77) ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పంత్ పించ్ హిట్టింగ్‌‌తో ఆసీస్ బౌలర్ల దుమ్ము దులిపాడు. భారత బ్యాట్స్‌‌మెన్ వీరోచితంగా పోరాడి డ్రా చేసుకున్న ఈ మ్యాచ్ టీమిండియా చరిత్రలో మరపురానిదిగా నిలుస్తుంది.

ఈ మ్యాచ్‌‌లో విహారి ఆడిన తీరుపై ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే ప్రశంసల వర్షం కురిపించాడు. విహారి తల్లి విజయలక్ష్మీ గారిని ఉద్దేశించి.. ‘విజయలక్ష్మీ గారు, మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు’ అని భోగ్లే ట్వీట్ చేయడం విశేషం. అశ్విన్ కూడా తన బ్యాటింగ్ క్లాస్‌‌ను నిరూపించుకున్నాడని మెచ్చుకున్నాడు.