లియో మూవీ కలెక్షన్స్ ఫేక్.. తిరుపూర్ సుబ్రహ్మణ్యం సంచలన కామెంట్స్

లియో మూవీ కలెక్షన్స్ ఫేక్.. తిరుపూర్ సుబ్రహ్మణ్యం సంచలన కామెంట్స్

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో.. తలపతి విజయ్(Thalapathy Vijay) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ లియో(Leo). దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 19న రిలీజయింది ఈ సినిమా. రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడటంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది ఈ సినిమా. మొదటిరోజు ఏకంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. వారం రోజుల్లో రూ.461 పైగా వసూళ్లు రాబట్టి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అయితే.. లియో కలెక్షన్స్ పై రోజుకో పుకారు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తాజాగా తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం లియో సినిమా కలెక్షన్స్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన లియో కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ.. లియో సినిమా విషయంలో మేకర్స్ చెప్తున్న కలెక్షన్స్ అన్ని ఫేక్. ఇప్పటివరకు తమిళనాడులోని ఒక్క థియేటర్ కి కూడా లాభాలు రాలేదు. చిత్ర నిర్మాత లలిత్ కుమార్ కోట్లు ఖర్చుపెట్టి మరీ ఫేక్ ప్రమోషన్స్ చేయిస్తున్నారు. తప్పుడు కలెక్షన్స్ చూపిస్తూ సినిమాపై లేని హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read :- రజనీకాంత్కు గుడికట్టిన అభిమాని

దీంతో విజయ్ అభిమానులు తిరుపూర్ సుబ్రహ్మణ్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బ్యాడ్ కామెట్స్ తో రెచ్చిపోతున్నారు. మరి తిరుపూర్ సుబ్రహ్మణ్యం చేసిన ఈ కామెంట్స్ పై లియో చిత్ర యూనిట్ ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.