Directorial Debut: అఫీషియల్.. బలగం వేణు బాటలో.. దర్శకుడిగా మరో టాలీవుడ్ స్టార్ కమెడియన్..

Directorial Debut: అఫీషియల్.. బలగం వేణు బాటలో.. దర్శకుడిగా మరో టాలీవుడ్ స్టార్ కమెడియన్..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ పరిచయం అక్కర్లేని పేరు. ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు చూరగొన్న రాహుల్.. ఇప్పడు మెగాఫోన్ పట్టాడు.

నటుడిగా, డైలాగ్ రైటర్గా సినీ ప్రస్థానం స్టార్ట్ చేసిన రాహుల్.. ఇప్పుడు దర్శకుడిగా మారనున్నాడు. నేడు శనివారం ఉదయం (జూన్14న)  X ఖాతాలో దర్శకుడిగా మారనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. 

ఆడిషన్ కాల్ VRUMIFILMS LLP ఫీచర్ ఫిల్మ్.. ‘‘దర్శకుడిగా నా ఫస్ట్ ప్రాజెక్ట్‌.. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షోరీల్స్‌, ఫొటోలను నా మెయిల్‌కు పంపించగలరు’’అని Xలో వెల్లడించారు. ఈ మూవీకి ఆయనే నిర్మాతగానూ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే రాహుల్ తన ఇంస్టాగ్రామ్లో GOLD అనే టైటిల్తో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ పోస్ట్ చేశాడు. దీనికి కమింగ్ సూన్ అనే క్యాప్షన్ ఇవ్వడం.. ఇంతలోనే ఆడిషన్ కాల్ అంటూ అనౌన్స్ మెంట్ రావడంతో కన్ఫామ్ అయిపొయింది. అయితే, తన తొలి సినిమాకు GOLD అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. 

ఇప్పటికే, టాలీవుడ్ కమెడియన్స్ దర్శకులుగా మారి టాలెంట్ నిరూపించుకున్నారు. 'బ‌లగం' మూవీతో వేణు, రామం రాఘ‌వంతో జ‌బ‌ర్ధ‌స్థ్ ధ‌న్‌రాజ్, చిరంజీవ అనే వెబ్ సీరీస్ తో అదిరే అభి.. ఇలా తమలోని టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. 

రాహుల్ రామకృష్ణ సినీ ప్రస్థానం:

రాహుల్ రామకృష్ణ తెలంగాణా రాష్ట్రానికి చెందిన నటుడు, రచయిత, విలేఖరి. సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ తో నటుడిగాఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించాడు. నేషనల్ అవార్డు గెలుచుకున్న పెళ్ళి చూపులు సినిమాలో రెండు పాటలు కూడా రాసి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు.

పాటల రచయిత, నటుడిగానే కాకుండా.. స్క్రీన్ రైటరుగా, టివిల్లో వంటల కార్యక్రమాల్లో వ్యాఖ్యాత లాంటి డిఫెరెంట్ ఫీల్డ్ లో తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా మారి తన సత్తా చాటనున్నాడు. 

రాహుల్ రామకృష్ణ సినిమాల విషయానికి వస్తే..

జయమ్ము నిశ్చయమ్ము రా మూవీతో సినిమలో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో నటుడిగా, డైలాగ్ రైటర్ గా పనిచేశాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, ఇంటెలిజెంట్, భరత్ అనే నేను, సమ్మోహనం, చి.ల.సౌ, గీత గోవిందం, హుషారు, కల్కి, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురములో, జాతి రత్నాలు, విమానం, ఖుషి, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు