మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ (Tovino Thomas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పల్లి చట్టంబి’ (Pallichattambi). లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా క్రేజీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేసి భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్.
ఇన్నాళ్లు రియలిస్టిక్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్తో ప్రేక్షకుల్నిఅలరిస్తున్న టోవినో.. ఈ సారి అంతకుమించి అనేలా రెడీ అయ్యాడు. మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా టొవినో థామస్ ‘పల్లి చట్టంబి’లో దర్శనం ఇస్తున్నాడు. మిస్టరీ, మైథాలజీ, పీరియాడికల్ బ్యాక్ డ్రాప్.. వంటి అంశాలతో టీజర్ ఆసక్తిగా సాగింది.
అందుకే తగ్గట్టుగానే విజువల్స్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. ‘పిశాచాలు ఉండే ప్రదేశమది. నీతో ఎన్ని సార్లు చెప్పాలి.. ఆ ప్రదేశం వైపు కన్నెత్తి కూడా చూడొద్దని’ అనే వాయిస్తో మొదలవుతూనే టీజర్ ఆసక్తి క్రియేట్ చేసింది.
‘ఆ దేవుని అనుగ్రహం ఉంటే ఈ దేవాలయం మీద ఏ పిశాచి నీడ కూడా పడదురా’ డైలాగ్ మిస్టరీ రివీల్ చేస్తుంది. ‘మనుషులు, సైతానులు ఎదురెదురుగా ఉండే ప్రదేశంలో.. ఆ దేవునితో పని ఏమిటి?’ అనే ప్రశ్నతో టీజర్ ఎండింగ్ అదిరిపోయింది. 48 సెకన్లతో కట్ చేసిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.
1950-60 కాలంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
ఇకపోతే, మలయాళ డబ్బింగ్ మూవీ స్ అయినా ‘మిన్నల్ మురళి’, 2018, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఆర్మ్ వంటి సినిమాలతో టోవినో మెప్పించడంతో ‘పల్లి చట్టంబి’పై భారీ అంచనాలు ఉన్నాయి.
INTENSE! 🔥🔥🔥
— Sony Music South India (@SonyMusicSouth) March 23, 2026
The hugely awaited #Pallichattambi teaser IS OUT NOW 🔥
Hit play into the WORLD OF PALLICHATTAMBI 🥳
Malayalam ➡️https://t.co/9xDMksB1yt
Tamil ➡️https://t.co/vwnUoOOtk9
Telugu ➡️https://t.co/w4SzyGs9uv
Kannada ➡️https://t.co/RH2krTKwxj@ttovino @jakes_bejoy… pic.twitter.com/zgWsLhpNLH
