Toxic Tabaahi Song Out: కియారాతో యష్ ఇంటెన్స్ రొమాన్స్.. టాక్సిక్ 'తబాహీ' వీడియో సాంగ్ రిలీజ్!

Toxic Tabaahi Song Out: కియారాతో యష్ ఇంటెన్స్ రొమాన్స్.. టాక్సిక్ 'తబాహీ' వీడియో సాంగ్ రిలీజ్!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ' టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ ఫర్ గోన్ అప్స్' ( Toxic ) నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. కొన్ని వారాల క్రితం రిలీజైన 'తబాహీ' లిరికల్ సాంగ్ ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచింది. అయితే అభిమానుల్లో ఆలోటు భర్తీ చేసేలా లేటెస్ట్ గా అఫీషియల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఊహించని రేంజ్ లో ఉన్న ఈ విజువల్ ట్రీట్ మూవీపై అంచనాలను మరింత హైప్ కు తీసుకెళ్లింది.

యష్ - కియారా కెమిస్ట్రీ రచ్చ..

ఈ వీడియో సాంగ్‌లో రాకింగ్ స్టార్ యష్, గ్లామర్ డాల్ కియారా అద్వానీ మధ్య ఉన్న సిజ్లింగ్ కెమిస్ట్రీ థియేటర్లలో మంటలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ లవ్ ట్రాక్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. సముద్రతీరంలో కౌగిలింతలు, కార్‌లో రొమాంటిక్ సీన్స్, ఒక గ్రాండ్ క్యాసినోలో స్టైలిష్ మూమెంట్స్.. వీటికి తోడు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే బ్యూటిఫుల్ సన్‌సెట్ షాట్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. 4 నిమిషాల 26 సెకన్ల నిడివి గల ఈ పాట.. ప్రపంచాన్ని సైతం తలకిందులు చేసే ఒక పవర్‌ఫుల్, ఇంటెన్స్ లవ్ స్టోరీని మనకు పరిచయం చేస్తోంది.

క్రేజీ కాంబో..

విశాల్ మిశ్రా కంపోజ్ చేసి పాడిన ఈ మెలోడీకి రాజ్ శేఖర్ లిరిక్స్ అందించారు. ఒక పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

►ALSO READ | Priyanka Chopra: ప్రియాంక చోప్రా గ్లామర్‌కు ప్యారిస్ ఫిదా.. కళ్లు తిప్పుకోలేని అందం అంటున్న నెటిజన్లు!

భారీ తారాగణం.. 

ఈ ప్యాన్-ఇండియన్ మూవీలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, టోవినో థామస్, అక్షయ్ ఒబెరాయ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. రవి బస్రూర్, తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.  మరి ఈ 'తబాహీ'విధ్వంసం థియేటర్లలో ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.