SRH vs RCB మధ్య టఫ్ ఫైట్.. రేపు ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే!

SRH vs RCB మధ్య టఫ్ ఫైట్.. రేపు ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే!

SRH vs RCB: ఐపీఎల్ (IPL 2026) లీగ్ దశ ముగింపునకు చేరుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), తమ హోమ్ గ్రౌండ్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో తలపడనుంది. రేపు (2026, మే 22) ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సొంతగడ్డపై ఆరెంజ్ ఆర్మీ ఆడే ఆఖరి మ్యాచ్ కావడంతో అభిమానులు భారీగా తరలివచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ పోలీస్ (ట్రాఫిక్-II) కీలక ట్రాఫిక్ డైవర్షన్లతో పాటు ఆంక్షలు విధించారు.
 
బిగ్ అలర్ట్: 
* టైమ్ లాక్: శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అర్ధరాత్రి 12:00 గంటల వరకు పక్కాగా అమల్లో ఉంటాయి.
* ట్రాఫిక్ జామ్ జోన్లు: నాగోల్ టూ హబ్సిగూడ (ఉప్పల్ జంక్షన్ రూట్), బోడుప్పల్ టూ అంబర్‌పేట్ (రామంతాపూర్ రూట్) మార్గాల్లో విపరీతమైన రద్దీ ఉండే ఛాన్స్ ఉంది.
* స్మార్ట్ ట్రావెల్ ఆప్షన్: ట్రాఫిక్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వెళ్లాలనుకునే వారు సొంత వాహనాలు పక్కన పెట్టి మెట్రో రైలు లేదా ఆర్టీసీ బస్సులను వాడటం బెస్ట్ ఛాయిస్.

భారీ వాహనాల మళ్లింపు: 
లారీలు, టిప్పర్లు, జేసీబీలు, కంటైనర్లు, ప్రైవేట్ బస్సులు, వాటర్ ట్యాంకర్లు హైదరాబాద్ నగరంలోకి రాకుండా కింది రూట్లలోకి డైవర్ట్ చేస్తున్నారు:
* ఘట్కేసర్ టు ఉప్పల్ రూట్: మెహఫిల్ హోటల్ (HMDA ఉప్పల్ భగ్యాత్ ఎంట్రన్స్) వద్దే వాహనాలను నాగోల్, -ఎల్బీ నగర్ వైపు మళ్లిస్తారు.
* ఎల్బీ నగర్ టు ఉప్పల్ రూట్: నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర యూ-టర్న్ తీసుకుని.. HMDA భగ్యాత్ - బోడుప్పల్ - చెంగిచెర్ల - ఘట్కేసర్ వైపు వెళ్లాల్సిందే. 
* తార్నాక టు ఉప్పల్ రూట్: హబ్సిగూడ ఎక్స్ రోడ్స్ వద్దే నాచారం - NFC రోటరీ - ఐఓసీఎల్ చర్లపల్లి - ఘట్కేసర్ వైపు రూట్ మార్చారు. 
* రామంతాపూర్ టు ఉప్పల్ రూట్: స్ట్రీట్ నం. 8 వద్ద హబ్సిగూడ ఎక్స్ రోడ్ - నాచారం రోటరీ - ఘట్కేసర్ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.
* ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా వరంగల్ రోడ్డును క్లోజ్ చేశారు. 

ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే:
* సికింద్రాబాద్ టు వరంగల్: సర్వే ఆఫ్ ఇండియా (పిస్తా హౌస్ పక్కన) నుంచి బీరప్ప గడ్డ - బోడుప్పల్ మీదుగా వరంగల్ హైవే ఎక్కాల్సిందే.
* వరంగల్ టు హైదరాబాద్/సికింద్రాబాద్: మేఫీల్డ్ హోటల్ దగ్గర ఉప్పల్ భగ్యాత్ - నాగోల్ మీదుగా సిటీలోకి ఎంటర్ అవ్వాలి.
* వరంగల్ టు హైదరాబాద్ (భారీ వాహనాలు): ఘట్కేసర్ దగ్గరే ORR (ఔటర్ రింగ్ రోడ్) ఎక్కి అబ్దుల్లాపూర్‌మెట్ ఎల్బీ నగర్ మీదుగా వెళ్లాలని సూచన.  
* హైదరాబాద్ టు వరంగల్ (భారీ వాహనాలు): ఎల్బీ నగర్ / హయత్ నగర్ / అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ORR ఎక్కి వరంగల్ చేరుకోవాలి.

 

►ALSO READ | IPL 2026: హార్ధిక్ జట్టు వాతావరణాన్ని నాశనం చేసిండు.. ముంబై కెప్టెన్‎గా మళ్లీ రోహిత్ శర్మ..?

 

క్రికెట్ ఫ్యాన్స్ గమనిక: 

* మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం మొత్తం 5 పార్కింగ్ జోన్లు సిద్ధం చేశారు. వాలిడ్ పాస్ లేకపోతే EK మినార్, LG గోదాం చెక్‌పోస్టుల దాటి లోపలికి ప్రవేశం లేదు. 
* హబ్సిగూడ రూట్ నుంచి వస్తే: సర్వే ఆఫ్ ఇండియా దగ్గర యూ-టర్న్ తీసుకుని.. EK మినార్ వద్ద పెంగ్విన్ పార్కింగ్ లేదా TG IALA పార్కింగ్ లో వెహికిల్స్ పార్క్ చేసుకోవాలి. 
* ఎల్బీ నగర్ రూట్ నుంచి వస్తే: DSL ఓపెన్ ప్లేస్, మోడర్న్ బేకరీ, LG గోదాం జంక్షన్ నుండి కెమేదా జంక్షన్ వరకు ఇండస్ట్రియల్ లేన్ రోడ్డు పక్కన పార్కింగ్ చేయాలని సూచన. 
* రామంతాపూర్ రూట్ నుంచి వస్తే: DSL మాల్ వద్ద యూటర్న్ తీసుకుని.. DSL ఓపెన్ ప్లేస్, మోడర్న్ బేకరీ ఏరియాలోనే పార్కింగ్ స్లాట్ వెతుక్కోవాలి.
* VVIP / VIP పాస్ హోల్డర్లు: కేవలం వీరికి మాత్రమే గేట్ 1A ద్వారా స్టేడియం లోపల ఉన్న 'A గ్రౌండ్' పార్కింగ్ లోకి అనుమతి ఇవ్వనున్నారు.