ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఐదుసార్లు టోర్నీ విజేత ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమైంది. హర్ధిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‌గా పేరున్న ఎంఐ ఇలా దారుణంగా విఫలమవడంపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ హాట్ కామెంట్స్ చేశారు.
ముంబై కెప్టెన్ హర్ధిక్ పాండ్య జట్టు వాతావరణాన్ని నాశనం చేశాడని అన్నారు. దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా నియమించాలని ముంబై యాజమాన్యానికి సూచించాడు. అలాగైతేనే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ బతికి బట్టకడుతుందని అన్నాడు. లేదంటే ముంబై ఇక టైటిల్ గెలవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘‘గత మూడేళ్లుగా రోహిత్ శర్మ తన కళ్లెదుటే తాను నిర్మించిన సామ్రాజ్యం కూలిపోవడాన్ని చూశాడు. కొన్నిసార్లు డగౌట్‌లో అతని హావభావాల గమనిస్తే అది అర్థం అవుతుంది. వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ లేదా జస్ప్రీత్ బుమ్రాలలో ఎవరో ఒకరు కొత్త కెప్టెన్‌గా ఉంటారని నాకు 200 శాతం నమ్మకం ఉంది.
►ALSO READ | RCB, CSKలకు 'కాక్రోచ్ జనతా పార్టీ' షాక్.. నెట్టింట Gen Zల హల్చల్.. అసలు కథ ఇదే!
బుమ్రా ఒక ఫాస్ట్ బౌలర్ కాబట్టి అతడు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో.. సూర్యకుమార్ యాదవ్‌నే కెప్టెన్‌గా ఎంచుకోవాలి. అయితే ముంబైకు 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మకు తిరిగి కొంత గౌరవాన్ని ఇవ్వడం కోసం అతడిని మళ్లీ కెప్టెన్‌గా తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతను తిరిగి వస్తే మళ్లీ ఒక మంచి జట్టును నిర్మించగల సత్తా అతనికి ఉంది’’ అని తివారీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
మరో భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ మాట్లాడుతూ..‘‘రోహిత్, సూర్యకుమార్, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లను కాదని హార్దిక్‌ను కెప్టెన్‌గా చేయాలన్న ముంబై ఇండియన్స్ నిర్ణయం ఎప్పటికీ మంచి ఫలితాలను ఇవ్వదు. ముంబై రిటైన్ చేసుకున్న రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కాదని బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తికి కెప్టెన్సీ ఇచ్చారు. ఈ నిర్ణయం కచ్చితంగా జట్టు వాతావరణాన్ని దెబ్బ తీస్తోంది. పరిస్థితి ఏదైనప్పటికీ ఈ నిర్ణయంతో సీనియర్ ఆటగాళ్లు ఒకింత నిరాశకు గురవుతారు’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
