10 వేల పరుగులు కొట్టావ్.. అందుకే టెస్టులకు టాటా చెప్పేశావా?.. కోహ్లీపై కపిల్ దేవ్ ఫైర్!

10 వేల పరుగులు కొట్టావ్.. అందుకే టెస్టులకు టాటా చెప్పేశావా?.. కోహ్లీపై కపిల్ దేవ్ ఫైర్!

Virat Kohli Test Retirement: భారత క్రికెట్ దిగ్గజం, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ భారత్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై ఫుల్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. గతేడాది (మే 2025లో) కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం తనకు అస్సలు నచ్చలేదని కపిల్ దేవ్ ఓపెన్‌గా చెప్పేసిండు. కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, ఆవేశంలో కాకుండా ఇంకొక ఆరు నెలలు ఓపిక పట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

డొమెస్టిక్ ఆడి తిరిగొచ్చే కోహ్లీ: 
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయంపై  కపిల్ దేవ్ అసంతృప్తిని వెళ్లగక్కాడు. విరాట్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పుడు నేను హ్యాపీగా లేను.. ఇది 10,000 పరుగులు లేదా ఏదైనా మైలురాయి గురించి కాదు.. అతడు ఆవేశపడకుండా ఒక ఆరు నెలలు ఓపికగా ఉండి ఉంటే.. మళ్లీ ఇండియాకు ఆడేవాడు.. సెలెక్టర్లు తీసేసినా, కెప్టెన్ వద్దన్నా పర్లేదు.. వెనక్కి వెళ్లి డొమెస్టిక్ క్రికెట్‌లో రన్స్ సాధించి మళ్లీ టీంలోకి వచ్చే సత్తా ఆయనకి ఉంది. ఎందుకంటే కోహ్లీ పక్కా టెస్ట్ ప్లేయర్ అని కపిల్ చెప్పుకొచ్చాడు. 

కోహ్లీ రూటే సపరేట్: కపిల్
విరాట్ కోహ్లీ మైదానంలో చూపించే దూకుడు (Aggression) గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ.. విరాట్ ని టెన్నిస్ లెజెండ్ జాన్ మెకెన్రోతో పోల్చాడు.. కింగ్ కోహ్లీని చూస్తే నాకు జాన్ మెకెన్రో గుర్తొస్తాడు.. వాడు అంపైర్లతో, ప్రత్యర్థులతో గొడవ పడితేనే గానీ తన బెస్ట్ ఆటను బయట పెట్టలేకపోయేవాడు.. కోహ్లీది కూడా అదే టైపు అని చెప్పాడు. రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్లు తలదించుకుని తమ ఆటతోనే సమాధానం చెప్తారు. కానీ కోహ్లీ సవాళ్లను ఇష్టపడతాడని కపిల్ పేర్కొన్నాడు. 

ALSO READ : మ్యాచ్‌లో చేసింది 14 పరుగులే.. కానీ సోషల్ మీడియాలో మాత్రం సెంచరీ కొట్టిన వైభవ్!

విరాట్ కోహ్లీ టెస్ట్ రికార్డులు:
14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌లో కోహ్లీ సృష్టించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు.. మొత్తం 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి.. 9,230 పరుగులు చేయడంతో పాటు 30 సెంచరీలు కొట్టాడు. ఇక తన కెప్టెన్సీలో 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలతో టీమిండియా తరపున అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.