న్యూఢిల్లీ: దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ మిసైల్స్ తయారీ ప్లాంట్‌ను అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఏర్పాటు చేయనుంది. డీఆర్‌డీఓ ట్రయల్స్ పూర్తి చేసిన వెంటనే, ఈ ప్లాంట్‌లో మాస్ ప్రొడ్యూస్ చేయొచ్చని కంపెనీ పేర్కొంది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఈ ప్రాజెక్టుకు ఆదివారం పునాది రాయి పడింది. ఒకే లొకేషన్‌లో ముడి పదార్థాల నుంచి యుద్ధానికి సిద్ధంగా ఉండే పూర్తి మిసైల్ సిస్టమ్స్ వరకు పూర్తి స్థాయి వాల్యూ చెయిన్‌ను ఇక్కడ అందించనున్నారు. ఈ ప్లాంట్ కోసం రాబోయే మూడేళ్లలో రూ.2,500 కోట్లను అదానీ గ్రూప్ ఇన్వెస్ట్ చేయనుంది.
