ప్రధాని పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 26న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ISB గ్రాడ్యుయేషన్ సెరిమెనీలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

  • గచ్చిబౌలి స్టేడియం, త్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి మధ్య ఉన్న ఆఫీసుల్లో పనిచేసే వారు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీస్ టైమింగ్స్ మార్చుకోవాలి.
  • గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లేవారు గచ్చిబౌలి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, మజీద్ బండ, హెచ్ సీయూ డిపో ద్వారా లింగంపల్లికి వెళ్లాలి.
  •  లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చే వారు హెచ్సీయూ డిపో దగ్గర లెఫ్ట్ తీసుకుని మజీద్ బండ, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్కి చేరుకోవాలి
  • విప్రో నుంచి లింగంపల్లికి వైపు వెళ్లే వారు విప్రో జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్పల్లి ఎక్స్ రోడ్, హెచ్సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల నుంచి లింగంపల్లి వైపు వెళ్లాలి
  • విప్రో నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు విప్రో జంక్షన్ దగ్గర రైట్ తీసుకుని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ, ఓఆర్ఆర్, ఎల్ఆండ్ టీ టవర్స్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్కు చేరుకోవాలి
  • కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వారు కేబుల్ బ్రిడ్జ్పైకి ఎక్కే ర్యాంప్ నుంచి రైట్ తీసుకొని రత్నదీప్, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్కు వెళ్లాలని పోలీసులు సూచించారు.

మరిన్ని వార్తల కోసం..

వాట్సాప్ లోనూ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ డౌన్ లోడ్

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో