సాంకేతిక లోపంతో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్: మూసారాంబాగ్ స్టేషన్ లో సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైలు నిలిచిపోయింది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న రైలులో మూసారాంబాగ్ స్టేషన్  వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు నిలిపివేశారు. రైలు నిలిచిపోవడంతో మైట్రోరైళ్ల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం నెలకొంది. దీంతో కొన్ని మెట్రోస్టేషన్లలో ప్రయాణికులు వేచి ఉన్నారు. ఆ తర్వాత సమస్య క్లియర్ చేయడంతో యధావిధిగా మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. ఆలస్యం కావడంతో మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.