తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నాడు కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బేవరేజెస్ గోదాం, పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ కోట్లు వసూళ్లు చేశాడు అక్కల రామకృష్ణ ప్రసాద్.
ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ హైదరాబాద్లో పలువురి వ్యాపారులతో పరిచయం ఏర్పాటు చేసుకొని బురిడీ కొట్టించాడు రామకృష్ణ . వ్యాపారి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు Loc జారీచేసి పారిపోతుండగా పట్టుకున్నారు. నరేందర్ కు బేవరేజ్ ఫ్యాక్టరీ పెట్టిస్తానంటూ కోటి 30 లక్షలు విడతల వారీగా వసూలు చేసి పరారయ్యాడు నిందితుడు.
తండ్రి వరప్రసాద్, మరో నిందితుడు విక్రమ్ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. ల్యాండ్ కొన్నానంటూ, సొంత ఫ్లాట్ అంటూ వ్యాపారులని నమ్మించి నట్టేట ముంచాడు రామకృష్ణ. రామకృష్ణ పై ఆస్ట్రేలియాలో అనేక చీటింగ్ కేసులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో రామకృష్ణ జైలు జీవితం గడిపినట్లు పోలీసులు తెలిపారు. రామకృష్ణ చేతిలో ఎవరైనా మోసపోయి ఉంటే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులని ఆశ్రయించాలని పోలీసులు తెలిపారు.
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి వ్యాపారవేతలను టార్గెట్ గా చేసి కోట్లాది రూపాయలు డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు రామకృష్ణ. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బెంగళూర్, ముంబై ప్రాంతాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించి అధిక లాభాలు వస్తాయంటూ నమ్మిస్తున్నాడు రామకృష్ణ. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 4 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఎగ్గొట్టినట్లు చెప్పారు పోలీసులు.
