శ్రీరామనవమి వేడుకలను సక్సెస్చేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

శ్రీరామనవమి వేడుకలను సక్సెస్చేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

భద్రాచలం, వెలుగు : శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం వంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్​జితేశ్ వి పాటిల్​అధికారులను ఆదేశించారు. మంగళవారం భద్రాచలం సబ్ కలెక్టర్​ఆఫీస్​లో శ్రీరామనవమి వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలకు ఇంకా నెలరోజుల సమయం ఉన్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రసాద్ స్కీం ద్వారా నడుస్తున్న పనులు మార్చి 20 నాటికి పూర్తి చేయాలన్నారు.

మిథిలాస్టేడియంలో స్వామివారి కల్యాణం వీక్షించే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఈవో దామోదర్​రావుకు సూచించారు. ఆన్​లైన్​ సౌకర్యం భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. టిక్కెట్లు, లాడ్జీల్లో గదులు ఆన్​లైన్ ద్వారా బుక్​ చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. పోలీస్, ఆర్​అండ్​బీ శాఖల సహకారం తీసుకోవాలని ఈవోకు చెప్పారు. శానిటేషన్​ సిబ్బందిని నియమించుకోవాలని, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలిపారు.

భక్తులకు టెంపరరీ టాయిలెట్లు అందుబాటులోకి తీసుకురావాలని, పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు. గజ ఈతగాళ్లు, నాటు పడవలు, నదిలో ప్రమాదహెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. భక్తుల నియంత్రణకు మూడంచెల భద్రత తప్పనిసరి చేయాలని పోలీసులకు సూచించారు. భక్తుల కోసం అత్యవసరంగా 24 గంటలు పనిచేసేలా అంబులెన్స్, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. సమావేశంలో పీవో బి.రాహుల్, ఏఎస్పీ విక్రాంత్​సింగ్​కుమార్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు.