జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పద్మశ్రీ కనకరాజు గుస్సాడి బృందం ప్రదర్శన ద్వారా సేకరించిన డబ్బుతో గ్రామంలో వీధి లైట్ల ఏర్పాటు చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. సిర్పూర్(యు) మండలం కోహినూర్ (బి) పంచాయతీ పరిధి సోముగూడ గ్రామంలో గుస్సాడి బృందం మంగళవారం ఆదర్శ కార్యక్రమాన్ని నిర్వహించింది. గుస్సాడి బృందం లీడర్ కనక సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు రూ.50వేలతో గ్రామంలో 15 హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు.
తాము ప్రదర్శించిన వివిధ కార్యక్రమాల్లో వచ్చిన డబ్బులతో ఈ కార్యక్రమం చేపట్టారు. దీంతో గ్రామం అంతా వెలుగులతో కళకళలాడింది. గ్రామ పటేల్ తొడసం గంగారాం, దేవరి కుమ్రం మారు, కారోబారి జూగ్నక్ గోదిరావ్, ఆత్రం దేవ్ రావ్, అంబాజీ రావ్, చందు, నోవానాథ్, సాయిరాజ్, గోవింద్, సంజీవ్, నాగోరావ్, నరేశ్, రవీందర్, రమేశ్, జంగు, హన్మంత్, కీర్తన్, షేకు, తులసిరాం తదితరులు పాల్గొన్నారు.
