రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లి గర్భంలో ఉన్న శిశువు మృతిచెందింది.పురిటినొప్పులతో ఆస్పత్రికివెళ్లగా సమయానికి చికిత్స అందించకుండా నిర్లక్ష్యంగా చేయడంతో గర్భిణీ కడుపులోనే శిశువు ప్రాణాలు కోల్పోయింది.దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్లితే..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం (ఫిబ్రవరి 25) ఈ ఘటన చోటు చేసుకుంది. బాలాపూర్ మండలం మామిడిపల్లికి చెందిన గర్భిణీ పురిటినొప్పులతో ఇబ్రహీంపట్నంలోని సాయి హర్షిత ఆస్పత్రి వెళ్లింది. ముందు గర్భిణీని పరీక్షలు చేసిన డాక్టర్లు అంతా బాగానే ఉందని చెప్పారు. అయితేఉన్నట్టుండి గర్భిణి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తయడంతో కడుపులోనే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
