ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, న్యూ ఢిల్లీ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక భయాందోళన కలిగించే సంఘటన చోటు చేసుకుంది. న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్ ధర్మేష్ భరద్వాజ్ తీవ్రంగా గాయపడ్డారు. బ్యాటర్ లక్ష్య థరేజా కొట్టిన షాట్ నేరుగా వచ్చి అంపైర్ ముఖానికి బలంగా తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ సాధించిన 36 పరుగుల విజయాన్ని పక్కకు నెట్టి, అందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
ఐసీయూలో అంపైర్ భరద్వాజ్:
న్యూ ఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆశిష్ మీనా వేసిన బంతిని బ్యాటర్ లక్ష్య థరేజా ముందుకు వచ్చి అత్యంత వేగంగా స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. బౌలర్‌ను దాటుకుని బుల్లెట్ వేగంతో వచ్చిన బంతి, అంపైర్ భరద్వాజ్ కుడి వైపు ముఖానికి బలంగా తాకింది. తప్పుకోవడానికి అంపైర్‌కు ఏమాత్రం సమయం దొరకలేదు.. వెంటనే ఆటను నిలిపివేసి, ప్లేయర్స్, వైద్య సిబ్బంది మైదానంలోకి పరుగులు తీశారు. వైద్య పరీక్షల తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రి తరలించి నిపుణుల పర్యవేక్షణ కోసం ఐసీయూ (ICU) లో చేర్పించారు. ఈ ఘటనతో బ్యాటర్ థరేజా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. గతంలో కూడా ఒక లీగ్ మ్యాచ్‌లో భరద్వాజ్ భుజానికి బంతి తగిలిన ఘటన జరగ్గా, ఇప్పుడు మళ్లీ ఇంత పెద్ద ప్రమాదం జరగడం అంపైర్ల భద్రతపై ఆందోళనలను పెంచింది.
ALSO READ : బంగ్లా చేతిలో ఘోర ఓటమి.
ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఘనవిజయం
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది. వంష్ మెహ్రా, అర్పిత రాణా శుభారంభం అందించగా, మయాంక్ రావత్ (23 బంతుల్లో 40), సూర్యాంశ్ రైనా (21 బంతుల్లో 33) వేగంగా పరుగులు సాధించారు. టైగర్స్ బౌలర్లలో రిషభ్ శర్మ 3/34 వికెట్లతో రాణించాడు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ ఢిల్లీ టైగర్స్ 156 పరుగులకే కుప్పకూలింది. హిమ్మత్ సింగ్ (31), థరేజాల మధ్య 48 పరుగుల భాగస్వామ్యం నమోదైనప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. దీంతో రైడర్స్ 36 రన్స్ తేడాతో విజయం సాధించింది. కానీ, అంపైర్ ధర్మేష్ భరద్వాజ్ తీవ్ర గాయంతో ఈ విజయాన్ని పక్కన పెట్టి అంతా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Scary scenes in the #DelhiPremierLeague 😳 Umpire #DharmeshBharadwaj was struck flush in the face by a powerful shot during the clash between #NewDelhiTigers and #EastDelhiRiders pic.twitter.com/7iX2pv3Dmi
— Viral News Vibes (@viralnewsvibes) August 18, 2026
