55 సార్లు బదిలీ అయిన రెబల్ కానిస్టేబుల్.. వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్ ఎలా ఉందంటే?

55 సార్లు బదిలీ అయిన రెబల్ కానిస్టేబుల్.. వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్ ఎలా ఉందంటే?

ఒక్కప్పటి టాలీవుడ్ లవర్ బాయ్, ‘పెళ్లి’, ‘మనసిచ్చి చూడు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరో వడ్డే నవీన్.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఆయన, కొన్నేళ్లుగా వెండితెరకు దూరమై సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే, ఇప్పుడు దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక పవర్‌ఫుల్ అండ్ క్రేజీ కాన్సెప్ట్‌తో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’.

లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్‌ను మేకర్స్ గురువారం గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే వడ్డే నవీన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో గట్టి వేటకే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇందులో ఎవరి మాట వినని, రూల్స్ బ్రేక్ చేసే ఒక రెబల్ కానిస్టేబుల్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. కేవలం తక్కువ సమయంలోనే ఏకంగా 55 సార్లు ట్రాన్స్‌ఫర్ అయిన ఒక సిన్సియర్, రఫ్ పోలీస్ ఆఫీసర్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఖాకీ చొక్కా వేసి వడ్డే నవీన్ పలికించిన హావభావాలు, యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.

►ALSO READ | Chiranjeevi: 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్.. తమ్ముడి క్లాప్‌పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

ఈ చిత్రానికి కమల్‌తేజ్ దర్శకత్వం వహిస్తుండగా, గ్లామరస్ బ్యూటీ రాశీసింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వడ్డే నవీన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను సినిమాలకు బ్రేక్ తీసుకోలేదు, పరిస్థితులే నాకు బ్రేక్ ఇచ్చాయి. నచ్చిన కథలు రాక, వచ్చిన కథలు చేయలేక ఈ గ్యాప్ వచ్చింది. కానీ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ స్క్రిప్ట్ వినగానే నా పాత ఎనర్జీ మళ్లీ వచ్చేసింది" అంటూ చెప్పుకొచ్చారు. కమర్షియల్ ఎలిమెంట్స్, అదిరిపోయే సస్పెన్స్, హై-వోల్టేజ్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రేజీ కానిస్టేబుల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హల్‌చల్ చేస్తాడో చూడాలి.