UI Trolling Song: ఇదేం ట్రోలింగ్ సాంగ్ భయ్యా.. దాదాపు అన్నీ కవర్ చేశారుగా!

UI Trolling Song: ఇదేం ట్రోలింగ్ సాంగ్ భయ్యా.. దాదాపు అన్నీ కవర్ చేశారుగా!

చిత్ర విచిత్రమైన సినిమాలు చేస్తూ కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నటుడు, దర్శకుడు ఉపేంద్ర(Upendra). ఆయన ఎంచుకునే సినిమాలు అన్నీ చాలా వింతగా, సరికొత్తగా ఉంటాయి. ఎవరికీ సాధ్యం కానీ కొత్త కథలతో సినిమాలు చేయడం ఆయనకు అలవాటే. రా, ఉపేంద్ర వంటి సినిమాలు అలా వచ్చినవే. తాజాగా మరోసారి అలాంటి సరికొత్త కాన్సెప్ట్ తో ఆయన చేస్తున్న లేటెస్ట్ మూవీ UI(UI). ఈ సినిమా కోసం హీరోగా, దర్శకుడిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి తాజాగా ట్రోలింగ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న టాపిక్స్ అన్నిటినీ ఈ సాంగ్ కవర్ చేశారు. ట్రోలవుతుందే.. నీది ట్రోలవుతుందే అంటూ సాగిన ఈ పాటు భలే వింతగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ట్రోల్ అయినా టాపిక్స్ అన్నీ ఈ సాంగ్ లో వినిపించాయి. మనల్నెవడ్రా ఆపేది, నేను విన్నాను నేను ఉన్నాను, కుర్చీని మడతపెట్టి, పాదాల మీద నడిచే యాత్ర, పూలమ్మని పాలమ్మిన, రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని, బంగారం ఒక మాట చెప్పనా, సర్సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అయ్యగానే నంబర్ వన్, జై బాలయ్య, కుమారి ఆంటీ, ఆరు గ్యారంటీలు, బర్రెలక్క వంటి అన్ని ట్రోలింగ్ టాపిక్స్ ను ఈ సాంగ్ లో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భలే వింతగా ఉన్న ఈ పాటను మీరు కూడా వినేయండి.