స్ట్రాంగ్​ మైండెడ్లా ఉన్నారు.. వీరికి సెట్ అవ్వదు.. నటి భర్తపై నెటిజన్స్​ ఫైర్

స్ట్రాంగ్​ మైండెడ్లా ఉన్నారు.. వీరికి సెట్ అవ్వదు.. నటి భర్తపై నెటిజన్స్​ ఫైర్

హిందీ బిగ్‌ బాస్ సీజన్ 17 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. బుల్లితెర నటి అంకితా లోఖండే హిందీ బిగ్​బాస్​ సీజన్​ 17లో భర్తతో కలిసి పార్టిసిపేట్​ చేస్తోంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ జంట హౌస్​లో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. తాజా ఎపిసోడ్​లో వీరిద్దరి ప్రవర్తన నెటిజన్లలో చర్చకు దారితీసింది.

అంకిత భర్త విక్కీ జైన్​ ఆమెతో మాట్లాడే తీరు సరిగ్గా లేదని మండిపడుతున్నారు. ‘నీలోని వరెస్ట్​ సైడ్​ని చూపిస్తున్నావు. కనీసం ఇక్కడ కూడా నాకు మనశ్శాంతినివ్వవా?.. ఎవ్వరినీ లెక్కచేయవు. నిన్నింత వరస్ట్​గా చూస్తాననుకోలేదు’ అంటూ షోలో ఆమెపై విరుచుకుపడ్డాడు. 

ఇది చూసిన నెటిజన్లు అంకిత ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందనుకోలేదు. అతని ప్రవర్తనేం బాలేదు అంటూ కామెంట్స్​ చేస్తున్నారు. మరికొందరేమో వీరిద్దరూ స్ట్రాంగ్​ మైండెడ్​లా ఉన్నారు. వీరికి సెట్​ అవ్వదంటూ విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా బిగ్‌బాస్ హోస్‌లో తన భార్య పట్ల విక్కీ జైన్ అలా వ్యవహరించడం సరికాదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ALSO READ:- నడి వీధుల్లోకి పులిని పట్టుకొచ్చిన వ్యక్తి.