Apollo services in Ayodhya: అయోధ్యలో అపోలో సేవలు.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఉపాసన భేటీ

Apollo services in Ayodhya: అయోధ్యలో అపోలో సేవలు.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఉపాసన భేటీ

మెగా కోడలు ఉపాసన(Upasana) అయోధ్య వెళ్లారు. అక్కడ అపోలో హాస్పిటల్ సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) తో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా.. అయోధ్యలో అపోలో సేవల గురించి వివరించారని సమాచారం. అనంతరం తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని వివరించే ది అపోలో స్టోరీ అనే బుక్ ని యోగి ఆదిత్యనాథ్ కి అందజేశారు ఉపాసన. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్యగా, ఓ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉంటారు ఆమె. అపోలో మెడికల్ క్యాంప్స్ ద్వారా చాలా మంది నిరుపేదలకు ఉచితంగా ఆమె వైద్య సేవలు అందిస్తున్నారు ఆమె. తన తాత ప్రతాప్ రెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తూ తనదైన ముద్రను వేశారు ఆమె. ప్రస్తుతం ఆ సేవలని అయోధ్యలో కూడా అందించేందుకు సిద్ధమయ్యారు.