ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే డయాబెటిస్‭కు చెక్

ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే డయాబెటిస్‭కు చెక్

మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంంది. ఎంత తినాలన్నా, ఏం తాగాలన్నా డయాబెటిస్ గురించి బయపడుతున్నారు. డయాబెటిస్​తో ఇబ్బంది పడేవారికి ఎలాంటి ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవాలన్నా భయమే. ఎందుకంటే అవి ఎక్కడ బ్లెడ్ లోని షుగర్ లెవల్స్ పెంచుతాయో అని భయం ఉంటుంది. కొన్ని డ్రింక్స్​తో బ్లడ్​లోని షుగర్ లెవెల్స్​ను కంట్రోల్ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ ఖాళీ కడుపుతోనే వాటిని తీసుకోవాలట. ఈ డ్రింక్స్ కేవలం మధుమేహమున్నవారే కాదు.. డయాబెటీస్ రాకుండా ఉండేందుకు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాల కోసం మీరు ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలో  ఇప్పుడు తెలుసుకుందాం. 

కలబంద 
ప్రతి ఇంట్లో ఉండే కలబంద ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. చర్మ సంరక్షణకు, గాయలను దూరం చేయడానికి సహాయం చేస్తుంది. పైగా దీనిలో హైపోగ్లైసీమిక్ ప్రభావాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిని ఖాళీ కడుపుతో తాగితే మంచిది. ఇది బ్లెడ్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. 

కాకరకాయ రసం
షుగర్ పేషంట్లకు కాకరకాయ ఓ వరమని చెప్పవచ్చు. కాకరకాయలో ఇన్సులిన్ చర్యను అనుకరించే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్​ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి కాకరకాయ రసాన్ని ఉదయాన్నే తీసుకుంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 

లెమన్ వాటర్
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో  నిమ్మరసం పిండి పరగడుపునే తాగాలి. ఈ డ్రింక్స్ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. బరువు నిర్వహణలో హెల్ప్ అవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 

మెంతి నీరు
మెంతి గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. కాబట్టి మీరు రాత్రి పడుకునే ముందు.. మెంతి గింజలను నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగవచ్చు. 

ఉసిరి రసం
ఇండియన్ గూస్ బెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది రెండు రకాలుగా పనికి వస్తుంది. కాబట్టి ఉసిరికాయలను మిక్సీ చేసి.. వాటి రసాన్ని షాట్​గా తీసుకోవచ్చు. 

తులసి టీ
హిందువులు పవిత్రంగా భావించే తులసితో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? ఇవి యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడం కోసం తాజా తులసి ఆకులతో టీని తయారు చేసుకోవచ్చు. ఇది రెగ్యూలర్​గా తీసుకుంటే చాలామంచిది. 

దాల్చిన చెక్క టీ
దాల్చిన చెక్క శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. కాబట్టి దాల్చిన చెక్కలను నీటిలో వేసి మరిగించి టీగా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్​లో ఉంటాయి. 

ఈ డ్రింక్స్​ని ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ప్రభావాలు పొందవచ్చు. అందుకే ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి అంటున్నారు. ఇవి మధుమేహాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా, శరీర బరువు కూడా నియంత్రణలో ఉంచుతాయట. ఇవి తాగాలనుకునే ముందు మీరు డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం.

ALSO READ :- Flipkart Big Upgrade sale : రూ.12 వేల స్మార్ట్ ఫోన్..రూ 9వేలకే..108MP కెమెరా,బ్యాటరీ అద్భుతం